Telugu News » Donald Trump: ఒపీనియన్ పోల్‌లో ట్రంప్ ఆధిక్యం.. బైడెన్ వెనుకంజ…!

Donald Trump: ఒపీనియన్ పోల్‌లో ట్రంప్ ఆధిక్యం.. బైడెన్ వెనుకంజ…!

కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వెనుకబడ్డారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని చర్చ నడుస్తోంది.

by Mano
Donald Trump: Trump leads in opinion polls... Biden lags behind...!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (US Elections) సంబంధించి ఒపీనియన్ పోల్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ముందంజలో ఉన్నారు. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ వెనుకబడ్డారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పనితీరు బాగుందని చర్చ నడుస్తోంది.

Donald Trump: Trump leads in opinion polls... Biden lags behind...!

జో బైడెన్((Joe Biden) కంటే ట్రంప్‌నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చింది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆధిక్యం లభించనున్నట్లు సమాచారం. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి.

బైడెన్ పనితీరుపై ఓటర్లు కొన్ని అంశాల్లో అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తేలింది.

ఒక్క విస్కాన్సిన్‌లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ట్రంప్‌నకు నెగెటివ్ మార్కులు రావడం గమనార్హం. అటు ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ మాత్రం బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని పేర్కొంది. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8 పర్సంటేజీ పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు వెల్లడించింది.

You may also like

Leave a Comment