సమాజంలో సామాన్య మధ్యతరగతి ఆడపిల్ల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఆడవారైతే చాలు రెచ్చిపోవడానికి.. ఇక రోడ్ల మీద, ప్రయాణాల్లో, చివరికి విమానంలో కూడా కొందరు మగవారు పశువుల్లా ప్రవర్తించడం తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రముఖ మలయాళ నటి (Malayalam actress) దివ్య ప్రభ (Divya Prabha) కూడా లైంగిక వేధింపులకు గురైనట్టు వెల్లడించారు.
ముంబై నుంచి కొచ్చి (Mumbai-Kochi)కి ఎయిర్ ఇండియా (Air India) విమానంలో ప్రయాణం చేస్తోన్న సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్ దృష్టికి తీసుకెళ్లగా వారు తాను కూర్చున్నసీటును మార్చారాని దివ్య ప్రభ అన్నారు.
అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ఇండియా ఆఫీసర్ కి తెలుపడంతో పోలీసుల సాయం పొందాలని సూచించినట్టు మలయాళ నటి చెప్పారు. కాగా ఈ ఘటన పై కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేసినట్టు నటి వివరించింది.