Telugu News » Earthquake: పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం..!

Earthquake: పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం..!

దీంతో కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (USS) తెలిపింది. అదేవిధంగా ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్ఓఎస్ హెచ్చరించింది.

by Mano
Earthquake: Huge earthquake in Papua New Guinea..!

పపువా న్యూ గినియా(Papua New Guinea)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9తీవ్రతతో భూమి కంపించింది. దీంతో కొంతమేరకు ప్రాణ నష్టం జరిగివుండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే (USS) తెలిపింది. అదేవిధంగా ఇక్కడ మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని యూఎస్ఓఎస్ హెచ్చరించింది.

Earthquake: Huge earthquake in Papua New Guinea..!

పపువా న్యూ గినియా ప్రాంతం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లో ఉంది. ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. గత ఏడాది ఏప్రిల్లో ప్రాంతంలో 7.0 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది.అప్పుడు ఏడుగురు మృతి చెందారు. తాజాగా వచ్చిన భూకంపానికి సంబంధించి యూఎస్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం అంబుంటి ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని కేంద్రం భూమి కింద 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

దీనికి ముందు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్ జెడ్) తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర పపువా న్యూ గినియాలోని మారుమూల ప్రాంతంలో 6.7తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 65కిలోమీటర్ల లోతున ఉంది. అయితే, ప్రస్తుతానికి సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడించారు.

ఈ విపత్తుతో ఎంతమేర ప్రాణనష్టం జరిగిందనే సమాచారం ఇంకా అందలేదు. ఈ భూకంపం కారణంగా ఆస్ట్రేలియాలో సునామీ ప్రమాదం లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ తెలిపింది. కాగా 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

You may also like

Leave a Comment