Telugu News » Eatala Rajender : మోడీ బరిగీసి కొట్లాడుతుంటే.. బీఆర్ఎస్ చిల్లర వేషాలు వేస్తోంది!

Eatala Rajender : మోడీ బరిగీసి కొట్లాడుతుంటే.. బీఆర్ఎస్ చిల్లర వేషాలు వేస్తోంది!

దళిత బంధు ఇస్తా అని ఇవ్వలేదు.. 3 ఎకరాలు ఇచ్చింది లేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు.. బీసీ బంద్ ఇస్తా అని చీట్ చేశారు.. చీటింగ్ లో నెంబర్ వన్ మీరు కాదా? అని ప్రశ్నించారు రాజేందర్. అవినీతి లేకపోతే, చేయకపోతే.. 900 కోట్లు మీ పార్టీ అకౌంట్ లోకి ఎలా వచ్చాయని నిలదీశారు. 2018, 19 ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయిని అడిగారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటికి వస్తాయని హెచ్చరించారు.

by admin
eatala-rajendar-press-meet-at-bjp-state-office

– విశ్వాసానికి మారు పేరు మోడీ
– విశ్వాస ఘాతుకానికి మారు పేరు కేసీఆర్
– మోడీని విమర్శించడం..
– సూర్యుని మీద ఉమ్మి వేయడమే!
– కేటీఆర్.. ఎవరు చీటర్?
– దళిత బంధు ఇస్తానని ఇవ్వలేదు
– 3 ఎకరాలు ఇవ్వలేదు
– డబుల్ బెడ్రూం ఇవ్వడం లేదు
– చీటింగ్ లో రేటింగ్ ఇస్తే మీరే నెంబర్ వన్
– రేవంత్ వి మతి లేని మాటలు
– ఈటల రాజేందర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

ప్రధాని మోడీ అవినీతి లేని పాలన అందిస్తున్నారని అన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. తెలంగాణ వచ్చిన నాటికి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేలు ఉంటే మోడీ వచ్చాక మరో 2,500 కిలోమీటర్లు వేశారని వివరించారు. విశ్వాసానికి మారు పేరు నరేంద్ర మోడీ అని చెప్పారు. అదే, విశ్వాస ఘాతుకానికి మారు పేరు అనగానే కేసీఆర్ గుర్తుకొస్తారని విమర్శించారు. కవిత ఎంపీగా పోటీ చేసిన నాడు.. గెలిపించండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అంటూ నిలదీశారు.

eatala-rajendar-press-meet-at-bjp-state-office

రామగుండం ఎరువుల కర్మాగారం చెప్పకపోయినా మోడీ రూ.6,300 కోట్లు పెట్టి తెరిపించి మన రైతులకు ఎరువుల కొరత లేకుండా చేశారని తెలిపారు. తెలంగాణ కోసం నిధులు ఇస్తున్న మోడీని.. ఏం ముఖం పెట్టుకొని వస్తావని అడగడం ఏంటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనేక పథకాలు నడుస్తున్నాయని వివరించారు. బియ్యం మూడు రూపాయలకు ఇస్తోంది కేంద్రమే.. కానీ, రేషన్ కార్డు మీద ప్రధాని ఫోటో ఉండదన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇచ్చేది కేంద్రమే.. కానీ ప్రధాని ఫోటో ఉండదని చెప్పారు. తమ ఫోటోలు ప్రజల గుండెల్లో ఉంటాయని.. మీరు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టుకున్నా ప్రజల హృదయాల్లో ఉండరని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

‘‘మోడీని టూరిస్ట్ అంటున్నారు. జాతీయ రాజకీయాలు అంటూ కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నారు కదా.. ఆయన టూరిస్టా? మహారాష్ట్రలో కేసీఆర్ తెలుగు మాట్లాడే వారు ఉన్నదగ్గరికే వెళ్తున్నారు. చెల్లని ముఖాలను ప్రత్యేక విమానం పెట్టి తీసుకువచ్చి ప్రగతి భవన్ లో కండువాలు కప్పుతున్నారు. ప్రగతి భవన్ నీ పార్టీ కార్యాలయమా..? కేటీఆర్ చిన్న వయసు, చదువుకున్న వాడివి, భవిష్యత్తు ఉన్నవాడివి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు. చీటర్ అంటున్నావు.. దళితున్ని సీఎం చేస్తా అని చెయ్యని కేసీఆర్ చీటర్ కాదా? ప్రధానిని విమర్శిస్తున్నారు కదా.. మెట్రో ఓపెనింగ్ కి వస్తే మోడీ పక్కన ఫోటోలు దిగింది మీరే కదా? ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎందుకు ముందస్తు ఎన్నికలు పెట్టుకున్నావు’’ అంటూ నిలదీశారు.

దళిత బంధు ఇస్తా అని ఇవ్వలేదు.. 3 ఎకరాలు ఇచ్చింది లేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు.. బీసీ బంద్ ఇస్తా అని చీట్ చేశారు.. చీటింగ్ లో నెంబర్ వన్ మీరు కాదా? అని ప్రశ్నించారు రాజేందర్. అవినీతి లేకపోతే, చేయకపోతే.. 900 కోట్లు మీ పార్టీ అకౌంట్ లోకి ఎలా వచ్చాయని నిలదీశారు. 2018, 19 ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయిని అడిగారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటికి వస్తాయని హెచ్చరించారు. మోడీని విమర్శించడం సూర్యుని మీద ఉమ్మి వేయడమేనని మండిపడ్డారు. ‘‘నిజాం కాలం నాడు కూడా ప్రధానిగా హిందువులు ఉన్నారు. కానీ, నీ కుటుంబానికి అన్ని పదవులు ఇచ్చుకున్నావు. 17 శాతం ఉన్న దళితులకు ఎన్ని మంత్రి పదవులు ఉన్నాయి. 52 శాతం ఉన్న బీసీలకు ఇచ్చిన మంత్రులు మూడేగా. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ లాంటివి ఇచ్చి కీలక పదవులు మీ దగ్గరే పెట్టుకున్నారు. మాది కుటుంబ పార్టీ అని మీరే చెప్పుకుంటున్నారు. మీ పార్టీ బతికునున్నంత కాలం.. పార్టీ అధ్యక్షుడు, సీఎం మీరేగా. కానీ, బీజేపీ అందరి పార్టీ. మోడీకి 140 కోట్ల మంది కుటుంబం’’ అని తెలిపారు.

బరిగీసి కొట్లాడుదాం అని ప్రధాని సవాల్ చేస్తే.. చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈటల. ఎవరు మునుగుతారో ప్రజలు తేలుస్తారని.. రేవంత్ రెడ్డి మతి లేని మాటలపై తాను స్పందించనని అన్నారు. గాలి వార్తలు సృష్టించే వారు ఎక్కువ అయ్యారన్న ఆయన.. కేసీఆర్ ఎన్డీఏలో చేరాలని అనుకున్నది ముమ్మాటికీ నిజమేనని తెలిపారు. కేటీఆర్ ను సీఎం చేసి ఆయన కేంద్రంలో మంత్రి అవ్వాలి అనుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏ మంత్రి పదవి చేపట్టాలి అనే చర్చ కూడా జరిగిందన్నారు. ఒడ్డెక్కేదాక ఓడ మళ్ళప్ప, ఓడ దిగాక బోడ మళ్ళప్ప అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోగానే.. ఎంపీ ఎన్నికల్లో సారు కారు పదహారు అని మొదలు పెట్టి ప్రధాని మీద వ్యక్తిగత విమర్శలు చేశారని గుర్తు చేశారు. హుజూరాబాద్ లో చిల్లర సైకో గాన్ని తీసుకొచ్చి ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వడ్డీతో సహా చెల్లిస్తామని.. తన లక్ష్యం కేసీఆర్ ను ఓడించడమేనని స్పష్టం చేశారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment