2023 ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) వివిధ మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల నియమాళిని ఉల్లఘించే వారి విషయంలో రెండు రోజుల క్రితం కొత్త యాప్ (New App) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోంది. ఇప్పటి వరకు ఎన్నికల్లో లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టే అభ్యర్థులు చివరకి నిబంధనలను అనుసరించి ఆ ఖర్చుని వందలు, వేలల్లో చూపిస్తుంటారు.
ఈసారి మాత్రం అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిబంధనలను, విధానాలను రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సంబంధించి అభ్యర్థులు పెట్టే ఖర్చులపై లెక్కలు పక్కాగా… ఉండాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాల్లో చేసే ఖర్చులు అంటే.. టీ (Tea), కాఫీ (Coffee) టిఫిన్ (Tiffin), భోజనాల కోసం ఎంత అవుతుందో చెప్పాలని ఈసీ ఆదేశించింది.
సభలో ఏర్పాటు చేసే ఒక్కో బెలూన్ ధర 4000 రూపాయలుగా, ఎల్ఈడి స్క్రీన్ కి రోజువారి అద్దె 15000 గా ఈసీ లెక్కగట్టింది. ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహిస్తే 15000 అభ్యర్థి ఖర్చులో రాయాలని తెలిపింది. అంతే కాకుండా సమావేశాలు నిర్వహించే సమయంలో వినియోగించే కుర్చీలు, టేబుళ్ల తో పాటు వెహికల్స్ రేట్ల రెంట్ నిర్దేశించింది. ఒకవేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కళాకారులకు ఎంత మొత్తం చెల్లిస్తుందో కూడా తెలపాలని ఆదేశించింది.
అయితే 2004తో పోలిస్తే ఈసీ ఇప్పుడు అభ్యర్థులకు కొంత వెసులుబాటు కల్పించింది. 2014లో ఎంపీ అభ్యర్థి ఎన్నికల వ్యయం 75 లక్షలు ఉండగా.. 2022లో 90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం 28 లక్షలు ఉండగా ప్రస్తుతం 40 లక్షలకు పెంచింది. మెను విషయానికి వస్తే ఒక సమోసా పది రూపాయలు. వాటర్ బాటిల్ 20 రూపాయలు. పులిహోర ప్యాకెట్ 20 నుంచి 30 రూపాయలు. టిఫిన్ రేటు 30 నుంచి 35 రూపాయలు. భోజనం ఖర్చు 80 రూపాయలు. వెజిటబుల్ బిర్యాని 80 నుంచి 70 రూపాయలు. చికెన్ బిర్యాని 100 నుంచి 140 రూపాయల మధ్య మటన్ బిర్యానీ 150 నుంచి 180 రూపాయల మధ్య ఉండాలని ఈసీ రేట్స్ ఫిక్స్ చేసింది.