రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీ (Political Parties ) లతో కేంద్ర ఎన్నికల బృందం విడివిడిగా సమావేశం అవుతోంది. టీడీపీ (TDP), సీపీయం (CPM) , ఆప్ (AAP) నాయకులతో ఈసీ సమావేశం అయింది. ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారుతున్నాయని ఈ సందర్బంగా ఎన్నికల సంఘ: దృష్టికి సీపీఎం పార్టీ తీసుకు వెళ్లింది. మునుగోడు – హుజురాబాద్ ఉప ఎన్నికను సీపీఎం కోడ్ చేసింది. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేయాలని వామపక్ష పార్టీలు కోరాయి.
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని బీఎస్పీ నేతలు కలిశారు. ఎన్నికల కమిషన్ సరిగా పని చేయాలని తాము కోరినట్టు తెలంగాణ బీఎస్పీ ప్రధాన కార్యదర్శి విజయార్య క్షత్రియ తెలిపారు. మాదక ద్రవ్యాల ముఠా, లిక్కర్ మాఫియాపై విచారణ జరిపించాలని కోరామన్నారు. కేసీఆర్ పై భూకబ్జా కేసును సుమోటోగా తీసుకోవాలని ఈసీని కోరామన్నారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై ఈసీ ఎందుకు అవగాహన కల్పించలేదని అడిగామన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహన్ని కట్టడి చేయాలని కోరామన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధి పై ఈసీ రోజు వారీ నిఘా పెట్టాలన్నారు. కులం, మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా పలు పార్టీలు వ్యాఖ్యలు చేస్తున్నాయన్నారు. ఇక ఓట్ల అవకతవకలపై ఈసీ ఫిర్యాదు చేశామని ఆప్ నేత సుధాకర్ అన్నారు.
మునుగోడులో డబ్బుల పంపిణి గురించి ఈసీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. బయో మెట్రిక్ పెట్టి ఓటు వేయని వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. బోగస్ ఓట్ల కట్టడి చేసి ఎన్నికల సమయంలో లిక్కర్ బ్యాన్ పెట్టాలని కోరామన్నారు. ఈసీని కలిసినట్టు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
ఓట్ల గల్లంతు అయితే రజత్ కుమార్ చెప్పిన క్షమాపణ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. గ్రేటర్ సిటీ శివారు ప్రాంతాల్లో సరైన విధంగా ఓటు నమోదు ప్రక్రియ సరిగ్గా జరగలేదని ఈసీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. అధికారులను ప్రభుత్వం భయ బ్రాంతులకు గురి చేస్తున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి చేస్తోందని ఫిర్యాదు చేశామన్నారు.
ఇతర రాష్ట్రాల అధికారులకు ఇక్కడ ఎన్నికల డ్యూటీ వేయాలని కోరామన్నారు. పోలీసు పరిశీలకులను నియమించాలని కోరామన్నారు. కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో దింపాలని కోరామన్నారు. దుబ్బాకలో కేంద్ర బలగాలు రావడం వల్లే సజావుగా ఎన్నికలు జరిగాయన్నారు. మునుగోడులో కేంద్ర బలగాలు రాలేదు కాబట్టే డబ్బులు ఏరులై పారాయన్నారు.
దొంగ ఓటర్లు లేకుండా న్యాయమైన లిస్ట్ తయారు చేసేలా ఇంకా కసరత్తు చేయాలన్నారు. సీఈవో రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషన్ బృందాన్ని కలిశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. వారి షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల చేయాల్సి వుందన్నారు. కానీ 19 వరకు ఇచ్చిన వినతులను, అభ్యంతరాలను కూడా విచారించాలని తాము కోరామన్నారు.
నాంపల్లిలో లక్షకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. డబ్బులు,మద్యాన్ని అరికట్టాలని కోరామన్నారు. గత ఎన్నికల్లో కొన్ని పోలీస్ వాహనాల్లో కూడా డబ్బు తరలించారని ఎన్నికల బృందం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే రాష్ట్ర ప్రభుత్వం తమకు కావాల్సిన అధికారులను బదిలీ చేస్తోందన్నారు.
ఇలాంటి అధికారుల ఆధ్వర్యంలో పారదర్శక ఎన్నికలు జరగవన్నారు. వారం పదిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో ప్రతి రోజూ ఇలా కొత్త పథకాల జీవోలను ప్రభుత్వం ఇవ్వడమంటే ప్రభుత్వ డబ్బుతో ఓట్లను కొనడమే అని వారికి చెప్పామన్నారు. వీటిపై వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. తమ సూచనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు.