ఢిల్లీ లిక్కర్ కేసులో నోటీసులపై సీఎం కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పందించారు. ఈడీ (ED) నోటీసులను రాజకీయ ప్రేరేపిత చర్య అని ఆయన తెలిపారు. కేవలం కాషాయ పార్టీ ఆదేశాల మేరకే తనకు నోటీసులు పంపించారని ఆరోపించారు. ఈ కేసులో ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్దమన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనకుండా తనను అడ్డుకునేందుకే ఈ నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
నోటీసులను వెంటనే ఈడీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా వుంటే ఈడీ విచారణకు గైర్హాజరవుతారని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇది ఇలా వుంటే ఈడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. విచారణకు ఈ రోజు తాను హాజరు కాలేనని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ముందే షెడ్యూల్ చేయబడిందని, ఈ కారణంగా విచారణకు హాజరు కాలేనని లేఖలో తెలిపారు.
ఈడీ నోటీసులు చట్ట విరుద్దమన్నారు. ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు పంపించేందుకు ఈడీ రెడీ అవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు సోమవారం ఈడీ నోటీసులు పంపింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు సీఎం కేజ్రీవాల్ అని బీజేపీ నేత హరీశ్ ఖురానా ఆరోపించారు. చట్ట ప్రకారమే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిందన్నారు. ఢిల్లీ రాజధాని వద్ద బీజేపీ నేతలు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. నేడు కాకపోతే.. రేపైనా ఈడీ ముందు కేజ్రీవాల్ నిజం చెప్పవలసి ఉంటుందన్నారు.