Telugu News » ED Raids : గడ్డం బ్రదర్స్ ని టార్గెట్ చేసిన దర్యాప్తు సంస్థలు

ED Raids : గడ్డం బ్రదర్స్ ని టార్గెట్ చేసిన దర్యాప్తు సంస్థలు

గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు వినోద్. ఆ సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. మంగళవారం వినోద్ తో పాటు ఆయన సోదరుడు వివేక్ ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది.

by admin
ed-raids-on-former-hca-president-vinod-and-ex-cricketers

ఎన్నికల నేపథ్యంలో ఐటీ (IT) శాఖ దాడులు నేతల్లో టెన్షన్ పుట్టిస్తుంటే.. ఈడీ (ED) కూడా ఎంటర్ అయింది. బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ (Gaddam Vinod) ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆయనతో పాటు అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు.

ed-raids-on-former-hca-president-vinod-and-ex-cricketers

ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) నిర్మాణ అవినీతికి సంబంధించి ఈడీ ఈ దాడులు చేసింది. 2013లో జరిగిన నార్త్, సౌత్ స్టాండ్స్ లో 3.30 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. అప్పట్లో 9 మందిపై కేసు కూడా నమోదైంది. ఏసీబీ మూడు చార్జీషీట్లు దాఖలు చేయగా.. వాటి ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో అర్షద్ అయూబ్, వినోద్, డీఎస్ చలపతి, జాన్ మనోజ్, శేషాద్రీ, దేవరాజ్, నరేష్ శర్మ, కిశోర్ కపూర్ నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో సోదాలు జరిగినట్టు సమాచారం.

గతంలో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నారు వినోద్. ఆ సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. మంగళవారం వినోద్ తో పాటు ఆయన సోదరుడు వివేక్ ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది. సోమాజీగూడలోని వివేక్ నివాసం, మంచిర్యాలలోని ఇంటిలోనూ తనిఖీలు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ కార్పొరేట్ ఆఫీసులో కూడా సోదాలు జరిపారు. వినోద్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.

ప్రస్తుతం చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి వినోద్ కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగమే ఈ దాడులు అని ఆరోపిస్తున్నారు హస్తం నేతలు. ఈ రెయిడ్స్ తో ఇద్దరు సోదరులను మానసికంగా ఇబ్బంది పెట్టొచ్చన్న ఆలోచనతోనే చేయిస్తున్నారని మండిపడుతున్నారు.

You may also like

Leave a Comment