Telugu News » Tirumala : తిరుమల కొండపై రూ. 2 కోట్ల బస్సు చోరి !

Tirumala : తిరుమల కొండపై రూ. 2 కోట్ల బస్సు చోరి !

తిరుమల కొండపై దొంగలున్నారు జాగ్రత్త అంటూ భక్తులకు హెచ్చరికలు చేస్తుంటారు. కానీ తిరుమల బస్సునే దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

by Prasanna
Electrical bus

ఒక వైపు తిరుమల (Tirumala) లో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ…తిరుమలకు చెందిన సుమారు రూ. 2 కోట్ల (2 Crores) విలువైన ఎలక్ట్రికల్ బస్ (Electrical Bus) ను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అది కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు దాటి గ్యారేజ్ లో ఉంచిన బస్ ని రాత్రి చోరి చేయడం తిరుమలలో హాట్ టాపిక్ గా మారింది.

Electrical bus

తిరుమల కొండపై దొంగలున్నారు జాగ్రత్త అంటూ భక్తులకు హెచ్చరికలు చేస్తుంటారు. కానీ తిరుమల బస్సునే దొంగలు ఎత్తికెళ్లిపోవడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. తిరుమల కొండ మీద భక్తుల ఉచిత ప్రయాణం కోసం టీటీడీ ఉపయోగించే ఎలక్ట్రిక్ బస్సు ఇది. ధర్మరథం పేరుతో దీనిని నడుపుతున్నారు.  ఆదివారం వేకువజామున 3.30 గంటల సమయంలో ఈ ఎలక్ట్రిక్ బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు.

గ్యారేజ్ లో ఉండాల్సిన ఎలక్ట్రికల్ బస్సు కనిపించకపోవడంతో దీనిని గుర్తించిన సిబ్బంది, వెంటనే ఈ బస్సు ఎక్కడుందో కనుగొనే ప్రయత్నం చేశారు. ఇది నాయుడు పేట వద్ద ఉన్నట్లు జీపీఎస్ ద్వారా గుర్తించారు. ఈ తెల్లవారుజామున జీఎన్సీ వద్ద టోల్ గేట్ దాటినట్లు జీపీఎస్ గుర్తించింది. కాసేపటికే ఆ బస్సును ఒంటిమిట్ట వద్ద టోల్ గేట్ సమీపంలో దుండగులు వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీటీడీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలే టీటీడీకి చెందిన హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసరు కారు కూడా దొంగతానికి గురైంది. ఆశ్చర్యమేంటంటే ఇది కూడా ఎలక్ట్రికల్ కారే.

మేఘా సంస్థకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి నెలలో టీటీడీకి పది ఎలక్ట్రిక్ బస్సులను కానుకగా ఇచ్చింది. వీటిలోని ఒక బస్సే చోరికి గురైనట్లు తెలుస్తోంది. టీటీడీ దేవస్థానమే కాకుండా ఆర్టీసీ కూడా రోజూ 65 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఈ ఏడాదే ప్రారంభించింది.

You may also like

Leave a Comment