Telugu News » python Attack : అమ్మో కొండచిలువ.. ఎంతపని చేసింది..!!

python Attack : అమ్మో కొండచిలువ.. ఎంతపని చేసింది..!!

ద్వారకా తిరుమల, వసంత నగర్ కాలనీ శివారులో ఉన్న పచ్చిక బయళ్ల వద్దకు స్థానిక మేకల కాపరి తన మేకలని తీసుకువెళ్లి మేపుతుంటాడు. అయితే పక్కనే పొదలలో దాగి ఉన్న ఓ భారీ కొండచిలువ మేక పై దాడి చేసి బలంగా చుట్టి చంపేసింది.

by Venu

ప్రకృతిని (Nature) నాశనం (Destroying) చేసి అభివృద్ధి (Developing) చెందుతోన్న మనుషుల (Humans) వల్ల ఎన్నో వినాశనాలు (Destructions) ఉత్పన్నం అవుతున్నాయి. అందులో మనిషి అనుకూలంగా జీవించడానికి తప్ప మిగతా జీవరాశులకు ప్రాణసంకటంగా మారుతోంది ఈ భూమి (Earth).. అందుకే అడవులలో ఉండవలసిన జంతువులు, పాములు మనషుల నివాస స్థలాల్లోకి వస్తున్నాయి.

ఇప్పటికే ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతుండటం సూపరిచితమే. ప్రస్తుతం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో హల్చల్ చేసిన 8 అడుగుల భారీ కొండచిలువ వల్ల స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ద్వారకా తిరుమల, వసంత నగర్ కాలనీ శివారులో ఉన్న పచ్చిక బయళ్ల వద్దకు స్థానిక మేకల కాపరి తన మేకలని తీసుకువెళ్లి మేపుతుంటాడు. అయితే పక్కనే పొదలలో దాగి ఉన్న ఓ భారీ కొండచిలువ మేక పై దాడి చేసి బలంగా చుట్టి చంపేసింది.

మేక మరణించిన అనంతరం ఆ కొండచిలువ మేకను మింగుతుండగా కాపరి గమనించి పెద్దగా కేకలు వేసాడు. అతని కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని కర్రలు సహాయంతో కొండచిలువను కొట్టి చంపారు. అయితే తనకు జీవనోపాధి అయిన మేక చనిపోవడంతో ఆ కాపరికి నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నాడు.

You may also like

Leave a Comment