Telugu News » Kaleswaram : కాళేశ్వరం పాపంలో పాత్రధారి.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీ రోల్.. మతలబేంటి..?

Kaleswaram : కాళేశ్వరం పాపంలో పాత్రధారి.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీ రోల్.. మతలబేంటి..?

రిటైర్డ్ అయినా కూడా ఈయన్ను ఎక్స్ టెన్షన్ పేరుతూ కేసీఆర్ ఎన్నో ఏళ్లుగా దగ్గర పెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈయన్ను కొనసాగిస్తోంది. అవినీతి జరిగిందని విచారణ చేస్తున్నప్పుడు విధులను పక్కనపెట్టి చేస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కానీ, కమిటీలో ఆయనే ఉంటే కీలక సమాచారం దాచిపెట్టే ఛాన్స్ ఉంటుంది.

by admin
enc-muralidharrao-corruptions-and-illegal-subcontracts

– కాళేశ్వరం అవినీతిని బయటపెడతామంటున్న కాంగ్రెస్
– కానీ, ఈఎన్సీ మురళీధర్ రావునే నమ్ముతున్న వైనం
– అధ్యయన కమిటీలో సభ్యుడిగా చేర్చాలని ఉత్తమ్ ప్రతిపాదన
– కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయంటున్న సీఎం రేవంత్
– మరి, ఆయనపై ఆయనే దర్యాప్తు చేసుకుంటారా?
– ఆనాడు ఈఎన్సీ హోదాలో ప్రతి బిల్లుకు ఆమోదం
– కాళేశ్వరం సూపర్ అంటూ గొప్పలు
– కొడుకు అభిషేక్ రావు కంపెనీకి సబ్ కాంట్రాక్టులు
– అవినీతి లెక్కలు తేలుస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
– మురళీధర్ రావు అనుమతులపై ఫోకస్ ఎందుకు పెట్టడం లేదు?
– landsandrecords.com పరిశోధనాత్మక కథనం

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనేది మొదట్నుంచి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు హస్తం పార్టీనే అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. టోటల్ కాళేశ్వరంపై అధ్యయనానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే.. ఆ కమిటీలో ఈఎన్సీ మురళీధర్ రావు కూడా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపాదన చేయడం.. దానికి ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మురళీధర్ రావు చేతుల మీదుగానే అన్ని బిల్లులు విడుదలయ్యాయి. జరిగిన అవినీతికి సాక్ష్యం ఆయనే. అలాంటి వ్యక్తిని కమిటీలో సభ్యుడిని చేయడం ఏంటి..? ఆయనపై ఆయనే దర్యాప్తు చేసుకుంటారా? అంటూ landsandrecords.com ఓ పరిశోధనాత్మక కథనాన్ని ఇచ్చింది.

enc-muralidharrao-corruptions-and-illegal-subcontracts

అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు.. కానీ..!

కాళేశ్వరంపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈమధ్య కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందులో కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యాతో కూడిన 8మందితో కమిటీ ఏర్పాటు చేయాలని భావించింది. వారిలో ఈఎన్సీ మురళీధర్ రావు కూడా ఒకరు. ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నిర్ణయం మేరకే చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా హెచ్చరించారు. అయితే.. మురళీధర్ రావు సభ్యుడిగా ఉండడంతో కీలక సమాచారం దాచి పెట్టి.. ఆయన చేసిన పనులను ఆయనే వెనుకేసుకొని రారనే గ్యారెంటీ ఏంటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

సమాచారం దాచడంలో దిట్ట.. నిజాలు బయటకెలా వస్తాయి?

తెలంగాణలో 10 ఏండ్లుగా రూ.2 లక్షల కోట్ల సాగునీటి ప్రాజెక్టుల పనులు జరిగాయి. అలాగే, రూ.50 వేల కోట్ల తాగునీటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటన్నింటకీ బిల్లుల జారీలో కీలక సూత్రధారి మురళీధర్ రావే. రిటైర్డ్ అయినా కూడా ఈయన్ను ఎక్స్ టెన్షన్ పేరుతూ కేసీఆర్ ఎన్నో ఏళ్లుగా దగ్గర పెట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈయన్ను కొనసాగిస్తోంది. అవినీతి జరిగిందని విచారణ చేస్తున్నప్పుడు విధులను పక్కనపెట్టి చేస్తే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కానీ, కమిటీలో ఆయనే ఉంటే కీలక సమాచారం దాచిపెట్టే ఛాన్స్ ఉంటుంది. కాళేశ్వరం పేరుతో ఏటీఎంలా వాడుకున్న‌ డ‌బ్బులు ఎటు వెళ్లాయో ఆరా తీయ‌డం మొద‌లు పెట్టాలి. ఎవ‌రెవ‌రికి ఎలా కేటాయింపులు చేశారు? వ‌ర్క ఆర్డ‌ర్స్ ఎలా వ‌చ్చాయి? అసలైన పాత్రధారులు, సూత్ర‌ధారులు ఎవ‌రు? అంచ‌నాలు ఎంత‌? ఖ‌ర్చు పెట్టింది ఎంత‌? రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరుతో ఇంజినీర్ ఇన్ చీఫ్ ముర‌ళీధ‌ర్ రావు అవినీతి బాగోతంపై గురి పెట్టాల్సి ఉంది. అలాంటిది ఆ మనిషికే కీలక కమిటీలో చోటు కల్పించడం ఏంటి..?

కుమారుడికి, తెలిసినవాళ్లకి లబ్ధి

కాళేశ్వరం కాంట్రాక్ట్ సంస్థ మేఘాతో స‌బ్ కాంట్రాక్ట్ డీల్స్ చాలా జరిగాయి. ఖ‌మ్మం జిల్లాలో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ గూటికి చేరిన ఉపేందర్ రెడ్డికి, ఆయ‌న అల్లుడికి చేసిన సేవ‌లకు గాను.. వ‌రంగ‌ల్ జిల్లాలోని బిల్లా హార్ష‌వ‌ర్ద‌న్ రెడ్డికి ఈఎన్సీ ఇప్పించిన కాంట్రాక్టులు చాలానే ఉన్నాయి. త‌న కుమారుడైన‌ సాయి అభిషేక్ రావుకి సంబంధించిన కంపెనీకి కాంట్రాక్టులు వెళ్లాయి. హర్ష కన్ స్ట్రక్షన్ తో పాటు మరో కంపెనీకి మేలు చేసినందుకు భారీగా లబ్ధి పొందినట్టు సమాచారం. ఇలా చాలానే జరిగాయి. అందుకే, కాళేశ్వరం అధ్యయన కమిటీలో మురళీధర్ రావుని తప్పించి విచారణ చేపడితే గానీ నిజానిజాలు బయటకు రావని landsandrecords.com కథనాన్ని ఇచ్చింది.

You may also like

Leave a Comment