బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) జోస్యం చెప్పారు. కాంగ్రెస్ (Congress) మోసాలు మొత్తం మరో 6 నెలల్లో బయటపడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు వరంగల్ (Warangal)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు..
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహాజమని.. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయని తెలిపారు.. ఈ మధ్యకాలంలో పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు. పేద ప్రజలకు ఎంతో మంచి చేసిన ఎన్టీఆర్‌నే ఓటర్లు ఓడించారని గుర్తు చేశారు.. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా పార్టీ మారాలని ఫోర్స్ చేసినట్లు తెలిపారు. కానీ ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టిన పార్టీ మాత్రం మారలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం తనను కూడా ఎవరెన్ని రకాలుగా బెదిరించిన భయపడనని దయాకర్ రావు స్పష్టం చేశారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) తాను పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రాచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
అలాంటి ఉద్దేశం తనకు లేదని తెలిపిన ఆయన.. కేసీఆర్ కోసం సైనికుడిలా పని చేస్తానని.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎర్రవబెల్లి, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ఊపందుకొన్నాయి. అయితే నేడు ఆయన ఇచ్చిన క్లారిటీతో ఆ వార్తలకు చెక్ పడిందని అనుకొంటున్నారు..