మద్యపానంలో తెలంగాణ (Tealngana )ను కేసీఆర్ (KCR) నెంబర్ వన్‌గా చేశారని బీజేపీ (BJP) ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గుడుంబాను నివారిస్తానని చెప్పి ఊరూరా కేసీఆర్ లిక్కర్ తీసుకు వచ్చారంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి కేసీఆర్ కు మళ్లీ ఓటు వేస్తే ఇక మన బతుకులు అగమేనని హెచ్చరించారు.
మహబూబ బాద్ నియోజ కవర్గంలో బీజేపీ బూత్ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. మానుకోట గడ్డ ఉద్యమాలకు పురిటి గడ్డ అని అన్నారు. అనేక మంది బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడుస్తున్నా యువతకు ఉద్యోగాలు లేవన్నారు.
ఈ విషయంలో తెలంగాణ యువత ఆలోచించాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మద్యం అమ్మకాల ద్వారా రూ. 45 వేల కోట్లను సీఎం కేసీఆర్ వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి అనేది కొనుక్కుంటే వచ్చేది కాదన్నారు. ప్రజలు బిక్ష పెడితే వచ్చేదన్నారు. చాయ్ అమ్మే ప్రధాని దేశాన్ని అమ్ముతున్నాడన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మోడీ దేశాన్ని అమ్మాడో లేదో అనే విషయంపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. కరోనా కష్ట కాలంలో పనిచేసిన కార్మికుల కాళ్లు కడిగి వారిని గౌరవించిన నాయకుడు ప్రధాని నరేంద్రమోడీ అని అన్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కలగానే మిగిలిందన్నారు. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ రూ. 600 కోట్లు ఖర్చు పెట్టిండన్నారు.దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తుండన్నారు.