Telugu News » September 30 : రూ. 2 వేల నోట్లున్నాయా? త్వరపడండి…జస్ట్ 5 డేస్

September 30 : రూ. 2 వేల నోట్లున్నాయా? త్వరపడండి…జస్ట్ 5 డేస్

కాగా, 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 నుంచి రూ. 2  వేల నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది.

by Prasanna
2000

రూ. 2000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడుపు సమీపిస్తోంది. బ్యాంకుల్లో (Banks) నోట్లు  మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడుపు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అంటే ఇంకా కేవలం ఐదు రోజులే మిగిలింది. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీ (Clean Note Policy) లో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

2000

కాగా, 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 నుంచి రూ. 2  వేల నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ. 2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

రూ. 2000 నోటును తీసుకోవటానికి ఏ బ్యాంకూ నిరాకరించే అవకాశం లేదని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకులో ఖాతా లేకపోతే మార్చుకొనే అవకాశం ఉండదనే ప్రచారం పైనా ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది. ఖాతా లేకపోయినా నిర్దేశించిన గుర్తింపు పత్రాలతో బ్యాంకుకు వెళ్లి నోటు మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. నోట్ల మార్పిడి కోసం కస్టమర్‌లకు ఛార్జీ విధించ కూడదని నిర్దేశించింది. కానీ, రోజు వారి పరిమితి మాత్రం రూ. 20 వేలుగా నిర్దారించింది.

ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రెండు వేల నోట్ల మార్పిడి కోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశాయి. ఒక వ్యక్తి గరిష్టంగా పది నోట్లను ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. ఖాతాకు కేవైసీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. కేవైసీ లేనిదే రూ.2,000 నోట్లు ఖాతాలో జమ కావని కూడా బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరో వైపు ఉపసంహరణ ప్రకటన తర్వాత ఆగష్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. వీటి విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని పేర్కొంది.

 

You may also like

Leave a Comment