బాలీవుడ్ (Bollywood)హీరోయిన్ రాణి ముఖర్జీ (Rani Mukarji) ఇన్నాళ్లు గుట్టుగా దాచుకున్న విషయాన్ని బయటపెట్టింది. దీంతో ఆమెకు పలువురు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఒక తల్లిగా ఆమె ఆవేదన సరైనదే అంటూ మద్దతు పలుకుతున్నారు. పరిస్థితులు ఎప్పుడూ మనచేతిలో ఉండవని, కాలనుగుణంగా మంచి, చెడును ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోవడమే జీవితం అంటూ మరికొందరు ఆమెకు ధైర్యం చెబుతూ బాసటగా నిలుస్తున్నారు.
ఇంతకు ఏమైందంటే బీ టౌన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ తనకు మరో బిడ్డను కనాలని ఉన్నా తన వయస్సు సహకరించడం లేదంటూ పోస్టు పెట్టింది. ‘నాకు ఒకే కూతురు ఉంది. తనకు తోడుగా తమ్ముడిని, చెల్లిని ఇవ్వాలని ఉంది. నా వయస్సు ఇప్పుడు 46 ఏళ్లు.
ఈ వయసులో ఇక బిడ్డను కనలేను. నాలుగేళ్ల కిందట గర్భం దాల్చాను. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. నాకు కూతురు పుట్టాక ఏడేళ్ల వరకు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా కాలేదు. నా కూతురికి తమ్ముడినో , చెల్లినో ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ మెలిపెడుతోంది’ అని ఆమె రాసుకొచ్చారు.
రాణిముఖర్జీ పోస్టుపై చాలా మంది ప్రముఖులు పాజిటివ్‌గా స్పందిస్తూ ఆమెకు మద్దతు పలుకుతున్నారు. బిడ్డలపై ప్రేమ చూపించడం, వారి కోసం నితంతరం తపిస్తూ ఉండటం ఒక్క తల్లికి మాత్రమే సాధ్యం అవుతుందని.. పిల్లల సంతోషం తల్లి తన సంతోషాన్ని సైతం త్యాగం చేస్తుందని అందుకు రాణి ముఖర్జీ నిదర్శమని మరికొందరు కొనియాడుతున్నారు.