వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్(West Indies star all-rounder Fabian Allen)కు చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024(South Africa T20 League 2024) కోసం అలెన్ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. అక్కడి జోహన్నెస్‌బర్గ్‌లోని ప్రఖ్యాత శాండ్రన్ సన్ హోటల్ సమీపంలో కొందరు దుండగలు అలెన్‌ను తుపాకీతో బెదిరించి అతడి సెల్‌ఫోన్, వ్యక్తిగత వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనతో అలెన్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వెస్టిండీస్ ప్రధాన కోచ్ ఆండ్రీ కోలీ ఫాబియన్ అలెన్‌తో మాట్లాడాడు. విండీస్ క్రికెటర్ ఒబెడ్ మెక్కాయ్ కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. మెక్కాయ్ ద్వారా ఆండ్రీ కోలీ సంప్రదింపులు జరిపాడు.
ప్రస్తుతం ఫాబియన్ అలెన్ క్షేమంగానే ఉన్నాడు. అయితే ఈ ఘటనపై క్రికెట్ సౌతాఫ్రికా, పార్ల్ రాయల్స్ స్పందించాల్సి ఉందని విండీస్ క్రికెట్ సీనియర్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కి తెలిపారు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024లో పార్ట్ రాయల్స్ టీమ్ తరఫున ఆడుతున్న అలెన్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 7.60 సగటుతో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు.
8.87 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. పార్ల్ రాయల్స్ ప్లేఆఫ్‌నకు అర్హత సాధించింది. నేడు జోబర్గ్ సూపర్ కింగ్స్ పార్ల్ రాయల్స్ తలపడుతుంది. ఇక అలెన్ 34 టీ20ల్లో 267 పరుగులతో పాటు 24 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ తరఫున 20 వన్డేలు ఆడి..200 పరుగులు, ఏడు వికెట్లు తీశాడు.