Telugu News » Fake Chocolates: కల్తీ చాక్లెట్ల దందా గుట్టు రట్టు.. ఎక్కడంటే..?

Fake Chocolates: కల్తీ చాక్లెట్ల దందా గుట్టు రట్టు.. ఎక్కడంటే..?

రాష్ట్రంలో నకిలీ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌(Rajendra Nagar)లో కల్తీ చాక్లెట్స్(Fake Chocolates) తయారీ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది.

by Mano
Fake Chocolates: Where are the fake chocolates?

మార్కెట్‌లో ఏ వస్తువు కొందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల విషయం అటుంచితే నాణ్యతలేని సరుకులతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. రాష్ట్రంలో నకిలీ దందా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌(Rajendra Nagar)లో కల్తీ చాక్లెట్స్(Fake Chocolates) తయారీ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది.

Fake Chocolates: Where are the fake chocolates?

హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు. నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలు వాడుతూ చాక్లెట్స్‌ను తయారీ చేస్తున్నారు. అందులో కుళ్లిపోయిన చింత పండును మరిగించి వచ్చిన గుజ్జును ప్యాకెట్లలో ప్యాకింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అటు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచిగానీ, స్థానిక జీహెచ్ఎమ్స్ అధికారుల నుంచి గానీ అనుమతి లేకుండానే నిర్వాహకులు కొంత కాలం నుంచి మురుగునీటి ప్రవాహం దగ్గరే ఈ చాక్లెట్స్ తయారీ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక, పరిశ్రమలో సైతం ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు. దుర్గంధంలోనే చాక్లెట్ల తయారీ చేస్తున్నారు. వాటికి ఆకర్షణీయమైన స్టికరింగ్ వేసి మార్కెట్‌లో విక్రయానికి ఉంచుతున్నారు.

దీంతో అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అటు సంబంధిత అధికారులు సైతం చూసి చూడనట్లు ఊరుకుంటున్నారు. కల్తీ చాక్లెట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

You may also like

Leave a Comment