Telugu News » Seethakka : ఫాంహౌస్ ఓనర్లు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారు.. హరీష్ రావుపై సీతక్క ఆగ్రహం..!!

Seethakka : ఫాంహౌస్ ఓనర్లు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారు.. హరీష్ రావుపై సీతక్క ఆగ్రహం..!!

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు సంక్షేమం మరచి రాష్ట్రాన్ని పాలించిందని సీతక్క ఆరోపించారు.. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్నవారికే బెనిఫిట్ అవుతుందని చెప్పారు.

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి.. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ (BRS)ను టార్గెట్ చేసి తీవ్రమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రస్తుతం అధికార పార్టీగా అవతరించింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంగా మారింది. అయితే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి రెండురోజులు కూడా అవ్వక ముందే.. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై ఆరోపణలు మొదలు పెట్టడం చర్చగా మారింది.

ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)..వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించడంతో.. మంత్రి సీతక్క (Minister Seethakka) కౌంటర్ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని, హరీష్ రావుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.. పాలన గురించి మీకు తెలియంది కాదని చురకలు అంటించారు..

మరోవైపు హరీష్ రావు ప్రశ్నకు సమాధానంగా.. మీ ప్రభుత్వ హయాంలో రైతులకు బోనస్ ఇచ్చారా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో రైతులు అష్టకష్టాలు పడ్డారని తెలిపిన సీతక్క.. వడ్ల కొనుగోళ్లలో మోసం చేశారని, క్వింటాల్ కు 10 కిలోలు కటింగ్ చేసి.. రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు.

వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతు సంక్షేమం మరచి రాష్ట్రాన్ని పాలించిందని సీతక్క ఆరోపించారు.. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్నవారికే బెనిఫిట్ అవుతుందని చెప్పారు. పెద్ద ఫాంహౌస్ ఓనర్లు, మాజీ మంత్రులు రైతుబంధు రాలేదని బాధపడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా లక్షల కోట్లు అప్పులు చేశారని, విలాసవంతమైన భవనాలు కట్టుకుని దర్జాగా ఉన్నారని మంత్రి సీతక్క ఆగ్రహించారు..

You may also like

Leave a Comment