ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారు జామున బెమెతరా జిల్లాలోని కత్తియా వద్ద ఆగి ఉన్న లారీని బొలెరో(Mahindra Bolero vehicle) వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 23 మందికి తీవ్రమైన గాయాలవ్వడంతో వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు బెమెతరా జిల్లా కలెక్టర్ రణ్వీర్ శర్మ వెల్లడించారు.
#WATCH | Chhattisgarh | Five people died after a car rammed into a parked vehicle in Bemetara. The injured have been shifted to the hospital for treatment: Ranveer Sharma, Collector Bemetara pic.twitter.com/dVfLm4bwLR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 28, 2024
గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, వారిని మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఎయిమ్స్ రాయ్‌పూర్‌కు తరలించామని ప్రకటించారు. బాధితులంతా ఓ శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. ఓవర్ స్పీడ్ కూడా ప్రమాదానికి కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనం పక్కనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి.