గంగా నగర్ (Ganga Nagar) హమ్ సఫర్ ఎక్స్ ప్రెస్ రైలు (Hamsafar EXpress Train)లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుజరాత్ లోని వల్సాద్ (Valsadh) నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే జనరేటర్ కోచ్ (Generator coach) తో పాటు దాని పక్కనే ఉన్న ప్యాసింజర్ బోగీ (Passenger Coach) లో మంటలు (Fire borke out) చెలరేగాయి.
రైలు నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంటలు చెలరేగిన కొద్ది సేపటికే అధికారులు అలర్ట్ అయ్యారు. రైలును ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. వల్సాద్ నుంచి బయలు దేరిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో రైలులో మంటలు చెలరేగినట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. పవర్ కోచ్‌లో షార్ట్ సర్య్యూట్ జరిగినట్టు చెప్పారు. దీంతో మంటలు చెలరేగి పక్కనే బీ 1` కోచ్ కు వ్యాపించాయని ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా వెల్లడించారు.
దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారన్నారు. వెంటనే రైలును ఆపి ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాలిపోయిన బోగీని తొలగించిన తర్వాత రైలును పంపిస్తామన్నారు. అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.