కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఇతరుల వైపు వేలెత్తి చూపించే ముందు రాహుల్ గాంధీ తనను తాను అద్దంలో చూసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ముందుగా తనను తాను ప్రశ్నించుకుంటే బాగుంటుందని ఆయన అన్నారు.
నాంపల్లిలోని ఎంఐఎం అభ్యర్థి తరఫున అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేశారు. 2019లో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 540 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. అప్పుడు 50 నియోజక వర్గాల్లో 50 స్థానాల్లో మాత్రమే విజయం సాధించ గలిగిందని తెలిపారు. ఆ ఎన్నికల్లో ప్రధాని మోడీ నుంచి రాహుల్ గాంధీ ఎంత డబ్బు తీసుకుందని ఆయన ప్రశ్నించారు.
బాబ్రీ మసీదు కూల్చివేతలో హస్తం ఉన్న శివసేన (యూబీటీ)తో హస్తం పార్టీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు మైనార్టీల, పేదల గొంతుకగా ఎంఐఎం పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. తాము పేదలు, మైనారిటీల కోసం పోరాడుతున్నామని, భవిష్యత్ లో కూడా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
కాంగ్రెస్ మెనిఫెస్టోపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు ఆ మెనిఫెస్టోలో ఏమీ లేదన్నారు. ఆ మెనిఫెస్టోలో ముస్లిమేతరకు చాలా ప్రయోజనాలను ప్రకటించరాన్నారు. కానీ ముస్లిం మహిళలకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలను ప్రకటించలేదన్నారు. ఇది ఆ పార్టీ సెలక్టివ్ విధానాన్ని తెలియచేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.