ఆకాశంలో వెళ్లే విమానం ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. విమానమేంటీ.. రోడ్డుపైకి రావడమేంటీ..? అనుకుంటున్నా.. అవునండీ.. ఓ విమానం నిజంగానే రోడ్డుపైకి వచ్చేసింది. అయితే ఆ విమానాన్ని తీసుకొచ్చింది మాత్రం ఓ భారీ ట్రక్కు.
అసలు విమానం రోడ్డుపైకి వచ్చిందేటీ.. ఎక్కడికి వెళ్తుంది.. ఎందుకు తీసుకెళ్తున్నారో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. మరికొందరైతే భారీ విమానంతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. విమానం పొడవు భారీ స్థాయిలో ఉండడంతో శంషాబాద్ జాతీయ రహదారిపైన ట్రక్కు రోడ్డు క్రాస్ చేయడానికి దాని వెనక ఉన్న వాహనాలన్ని నిలిపోయాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అనంతపూర్‌లోని కస్టమ్స్ ఏవియేషన్ అకాడమి కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ భారీ విమానాన్ని తరలించారు అధికారులు. ఈ విమాన ప్రయాణికుల కెపాసిటీ 180 మందికి సరిపడా ఉంటుందని అధికారులు చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనంతపూర్‌కు అధికారులు ఓ భారీ విమానాన్ని తరలించారు.
ఎయిర్ ఇండియా విమాన విడిభాగాలను రెండు భారీ ట్రక్కుల్లో 25 టన్నుల విమాన బాడీని చేరవేశారు. మరో ట్రక్కులో విమానం ఇంజన్ సామగ్రిని కూడా రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ విమానం శంషాబాద్ జాతీయ రహదారికి చేరుకోగానే ఎయిర్ ఇండియా విమానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.