Telugu News » ప్లాస్టిక్ వేస్ట్ తో పెట్రోల్ ఫ్రీ.. ఏంటి నిజమే.!?

ప్లాస్టిక్ వేస్ట్ తో పెట్రోల్ ఫ్రీ.. ఏంటి నిజమే.!?

by admin
free-petrol-for-plastic-waste

మీ ఇంట్లో విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, తెగిపోయిన ప్లాస్టిక్ వైర్లు, కాలం చెల్లిన మొబైళ్లు చిత్రవిచిత్ర ప్లాస్టిక్ చెత్తంతా పొరపాటున పారేస్తున్నారా? అలా చేయ‌కండి. పెట్రోల్ బంకుకి తీసుకెళ్లి ఇస్తే లీటర్ పెట్రోల్ ఇస్తారట. అవును, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్లిచ్చే బంపరాఫరిది.

free-petrol-for-plastic-waste

పర్యావరణాన్ని కాపాడేందుకు తాము ఈ ఆఫర్ అమలు చేస్తున్నామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అందుకే, ప్లాస్టిక్ వేస్ట్ స్వీకరించి పెట్రోల్ ఫ్రీగా అందిస్తున్నామని పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలో ఎంపిక చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ప్లాస్టిక్ వేస్ట్ తీసుకుని వస్తే పెట్రోల్ ఉచితంగా పొందవచ్చని స‌ద‌రు సంస్థ‌ ప్రకటించింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల వివరాలను కూడా వెల్లడించింది.

హైటెక్ సిటీ సమీపంలోని లెమన్ ట్రీ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో, ఐకియా స్టోర్ సమీపంలోని బంకులో, జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని బంకులో, మియాపూర్ సమీపంలోని సైబర్ ఫిల్లింగ్ స్టేషన్ లో, బేగంపేట రోడ్ లోని ప్రకాష్ నగర్ వద్ద ఉన్న బంకులో ఈ విధానం అమలు చేస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరించింది.

ఈ ఆఫర్ తో ఆయా పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు. పనికిరాని వేస్ట్ తీసుకువచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఇండియన్ ఆయిల్ యాజమాన్యం అమలు చేస్తున్న ఈ విధానం ఎంతో బాగుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్లాస్టిక్ వేస్ట్ నుంచి దేశాన్ని రక్షించడమే తమ ఉద్దేశమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పింది. ఎవరైనా పది కేజీల కన్నా ఎక్కువ పనికి రాని ప్లాస్టిక్, ఈ వేస్ట్ వస్తువులను తీసుకొస్తే వారికి అదనంగా మరో లీటర్ పెట్రోల్ అందిస్తామని తెలిపింది.

You may also like

Leave a Comment