ప్రతీనెలా 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు(Oil Company’s) సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల(International market prices)కు అనుగుణంగా ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు లబ్ధి చేకూరనుంది.
రాజధాని ఢిల్లీ(Delhi)లో 19కిలోల సిలిండర్ ధర(Gas Cylinder Price) రూ.30.50 తగ్గి రూ.1,764.50కు చేరింది. రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పు ఉంటుందని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పట్నాలో గరిష్ఠంగా ఒక్కో సిలిండర్‌పై రూ.33వరకు తగ్గింది. హైదరాబాద్‌లో రూ.32.50 తగ్గి రూ.1,994.50కు, విశాఖపట్నంలో రూ.32 తగ్గి రూ.1,826.50కు చేరింది. మరోవైపు ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ ధరను సైతం రూ.7.50 తగ్గించారు.
మార్చి 1న వాణిజ్య వంటగ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచిన విషయం తెలిసిందే. ఒక్కో సిలిండర్‌పై రూ.25మేర పెంచాయి. అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం గమనార్హం. అయితే, గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేవని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. 14.2 కేజీల సిలిండర్‌కు రూ.955 ఉండగా ఇటీవలే రూ.100 తగ్గించి రూ.855 నిర్ణయించింది.