ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) యుద్ధం కారణంగా గాజా (Gaza)లో పరిస్థితులు దారుణంగా మారాయి.. నీరు, ఆహారం, నివాసాలు లేక పాలస్తీనియన్లు అలమటించిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.. అనేక మంది నిర్వాసితులయ్యారు. అయిన వాళ్ళను కోల్పోయి అనాధలుగా మారారు.. ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కన్నీళ్లతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు..

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన అమెరికా.. గాలిలోకి జారవిడిచిన 18 బండిల్స్‌లో మూడు బండిల్స్ పారాచూట్లు పనిచేయక నీటిలో పడిపోయాయని తెలిపింది. కాగా మరణాలను యూఎస్ ధ్రువీకరించలేదు. మరోవైపు సహాయక సామాగ్రిని గాలిలోంచి పంపడం సరికాదని, ఈ చర్యలను వెంటనే నిలపాలని
పాలస్తీనా ప్రభుత్వం పేర్కొంది.
ఇకపోతే గత కొన్ని రోజులుగా గాజా పౌరులకు, పారాచూట్ల సాయంతో అమెరికా మానవతా సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల ప్రారంభంలో గాజా సిటీకి పశ్చిమాన ఉన్న అల్ షాతి క్యాంప్‌లో ఎయిర్‌డ్రాప్డ్ సహాయ ప్యాకేజీలు మీద పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి..