Telugu News » Goa : మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిన గోవా జైలు.. ఇక్కడి నుంచి దందా నడిపిన స్మగ్లర్లు..!

Goa : మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిన గోవా జైలు.. ఇక్కడి నుంచి దందా నడిపిన స్మగ్లర్లు..!

ఓక్రా సహా మరో ఇద్దరితో కలిసి నిందితుడు చిన్న మొత్తంలో మత్తు పదార్థాలు అమ్మకం ప్రారంబించాడు.. కాగా, రెండేళ్ల క్రితం ఓక్రా సహా మరో ఇద్దరు ఇదే కేసులో అరెస్టై జైలుకు వెళ్లిపోగా.. దీంతో స్టాన్లీకి విదేశాల నుంచి మత్తు పదార్థాలు వచ్చే మార్గం క్లోజ్ అయింది..

by Venu
drugs

మత్తు దందాపై చట్టం ఉక్కుపాదం మోపుతున్న వ్యాపారం ఆగడం లేదు. ఇప్పటికే మాదకద్రవ్యాల అమ్మకాలపై నిఘా పెంచిన అధికారులు.. పెద్ద మొత్తంలో వాటిని స్వాధీనం చేసుకొంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 8 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో మరో కీలక నిందితుడు సౌరవ్ ను హైదరాబాద్‌ (Hyderabad), పంజాగుట్ట (Panjagutta) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అదుపులోకి తీసుకొన్నారు.

drugs

సౌరవ్‌ను, పుణె (Pune)లో టీఎస్‌ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేసి, హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విచారణ చేసిన పంజాగుట్ట పోలీసులు అనంతరం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తీసుకెళ్లారు. మరోవైపు స్టాన్లీని ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు వ్యాపార వీసాపై వచ్చి గోవా (Goa)లో బట్టల వ్యాపారం చేస్తున్న టైంలో స్టాన్లీకి.. కండోలిమ్ ప్రాంతంలో ఉంటున్న మత్తు పదార్థాలు సరఫరా చేసే నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో ఓక్రా సహా మరో ఇద్దరితో కలిసి నిందితుడు చిన్న మొత్తంలో మత్తు పదార్థాలు అమ్మకం ప్రారంబించాడు.. కాగా, రెండేళ్ల క్రితం ఓక్రా సహా మరో ఇద్దరు ఇదే కేసులో అరెస్టై జైలుకు వెళ్లిపోగా.. దీంతో స్టాన్లీకి విదేశాల నుంచి మత్తు పదార్థాలు వచ్చే మార్గం క్లోజ్ అయింది.. అయితే, ఓక్రా గోవా జైలు నుంచే ఈ దందాను కొనసాగించాడు. ఇందులో ఓక్రాకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఓక్రా నైజీరియా నుంచి మత్తు పదార్థాలు తెప్పించి సౌరభ్‌కు ఇచ్చేవాడు.. ఓక్రా ఆదేశాలతో సౌరభ్.. స్టాండ్లీకి వాటిని సరఫరా చేశాడు. మరోవైపు తెలంగాణ (Telangana) డ్రగ్ కంట్రోల్ అధికారుల సమాచారంతో, గోవా జైలులో సోదాలు చేయగా.. జైలులో ఉన్న ఓక్రా దగ్గర 16 సెల్‌ఫోన్లు దొరికాయి.. దీంతో వాటిని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. జైలు నుంచే మాదక ద్రవ్యాల బిజినెస్ చేస్తున్న ఓక్రాతో పాటు దీనితో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

You may also like

Leave a Comment