Telugu News » Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ తొలి పూజ

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ తొలి పూజ

కుడివైపు పంచముఖ లక్ష్మీనరసింహస్వామి ఉండగా ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

by Prasanna
Tamilisai

ఖైరతాబాద్ (Khairatabad ) లో శ్రీ దశ మహా విద్యాగణపతి కొలువుదీరాడు. వేందమంత్రాల నడుమ అర్చకులు మహా గణేశుడికి ప్రాణ ప్రతిష్ఠాపన చేశారు. ఖైరతాబాద్ గణపయ్యకు గవర్నర్ తమిళిసై (Tamilisai) మంత్రి తలసాని‌ (Talasani), హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ లతో కలిసి తొలిపూజను నిర్వహించారు.  గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయింది.

Tamilisai

ఖైరతాబాద్ వినాయకుడంటేనే విభిన్న రూపాల్లో దర్శనమిచ్చే గణేశుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ సంవత్సరం శ్రీ దశ మహా విద్యాగణపతిగా కొలువుదీరాడు. మొత్తం 63 అడుగుల మట్టి ఎత్తులో ఈ గణపయ్యను ఏర్పాటు చేశారు. కుడివైపు పంచముఖ లక్ష్మీనరసింహస్వామి ఉండగా ఎడమవైపు వీరభద్ర స్వామి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.

ఒక్క రోజే లక్ష మంది

ఖైరతాబాద్ గణేశుడి తొలి పూజలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీంతో గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలైంది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. కళాకారుల ఆటపాటలతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. మొదటి రోజే సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బారీకేడ్లు, క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు.

అంతటా గణేశుడే…

సాయంత్రం ఆరు గంటలకు తొలిపూజ అందుకోనున్న బాలాపూర్ గణపయ్య, ఈ ఏడాది పంచముఖి నాగేంద్రునిపై కూర్చుని దర్శనం ఇవ్వనున్నారు. ఈసారి 18 అడుగుల ఎత్తుతో గణనాథుడిని‌ ఏర్పాటు చేసిన ఉత్సవకమిటీ గణేశుడి మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది.

హైదరాబాద్ అంతటా గణేష్ చతుర్థి శోభ వెల్లివిరిసింది. దీంతో నగరవ్యాప్తంగా సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొలువుదీరిన చిట్టి గణపయ్యలు వాడవాడలా పూజలందుకుంటున్నారు.

You may also like

Leave a Comment