ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి.. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన నేతలకు.. బీజేపీ (BJP), తెలుగుదేశం (TDP), జనసేన (Janasena) పొత్తు పంటికింద రాయిలా మారిందని అనుకొంటున్నారు.. అదేవిధంగా సీట్ల పంపకంలో కొందరికి అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిలో ఒక కీలక నేత ఉన్నారు.. ఆయనే ఎంపీ (MP) జీవీఎల్ నరసింహరావు (GVL Narasimha Rao)..

ఈ నేపథ్యంలో ఎంపీ జీవీఎల్ నేడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీటు దక్కకపోవడంపై బాధపడిన విషయాన్ని తెలియచేస్తూ.. భవిష్యత్తులో కూడా విశాఖ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.. విశాఖ (Visakhapatnam) లోక్‌సభ టికెట్ తనకు రానందుకు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కలత చెంది ఫోన్ చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు..
విశాఖలో మూడేళ్ళుగా ఉంటూ.. మీ అందరిలో ఒకరిగా కలిసిపోయానని తెలిపారు.. పదవి దక్కకపోయినంత మాత్రాన ప్రజలకు దూరం అవనని.. అన్ని సమస్యలపై పోరాడుతానని వెల్లడించారు.. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలను ఇప్పటికే పరిష్కరించానని ఎంపీ తెలిపారు.. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. వృథా అయిందని ఎవరైనా భావిస్తే అది తప్పు అని పేర్కొన్నారు.. విశాఖతో పాటు.. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేలా కార్యాచరణ రూపొందించుకుందామన్నారు..