Telugu News » Gyanvapi Mosque : ఇష్యూ మరోసారి లేవనెత్తాల్సిన అవసరం లేదు.. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు కీలక తీర్పు..!

Gyanvapi Mosque : ఇష్యూ మరోసారి లేవనెత్తాల్సిన అవసరం లేదు.. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు కీలక తీర్పు..!

హిందువులు వారణాసి జిల్లా కోర్టులో జ్ఞాన‌వాపిపై పిటిషన్ దాఖలు చేశారు. వివాదస్పదమైన జ్ఞానవాసీ మసీదును.. తమ ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని అందులో పేర్కొన్నారు.

by Venu

అలహాబాద్ (Allahabad) హైకోర్టు (HighCourt) జ్ఞాన‌వాపి మసీదు (Gyanvapi Mosque) కేసులో నేడు సంచలన తీర్పు వెల్లడించింది. మసీదులో హిందువుల పూజకు అనుమతిస్తూ వారణాసి (Varanasi) జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గతంలో మసీదు కమిటీ సభ్యుడు అంజుమాన్ ఇంతేజామియా దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం.. హిందువులు పూజలు చేసుకోవచ్చని తీర్పు వెల్లడించింది.

కాగా హిందువులు వారణాసి జిల్లా కోర్టులో జ్ఞాన‌వాపిపై పిటిషన్ దాఖలు చేశారు. వివాదస్పదమైన జ్ఞానవాసీ మసీదును.. తమ ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు.. మసీదులో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఏఎస్‌ఐను ఆదేశించింది. ఈ క్రమంలో జ్ఞానవాపి మసీదు, ఆలయంపైనే నిర్మించారని ఏఎస్ఐ, కోర్టుకు నివేదిక సమర్పించింది.

అయితే సోమవారం ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాస్థానం.. హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. పూజలు చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఈ ఇష్యూను మరోసారి లేవనెత్తాల్సిన అవసరం కూడా లేదంటూ వ్యాఖ్యానించింది. దీంతో హిందువులకు భారీ ఊరట లభించిది. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వార‌ణాసిలో ఉన్న పురాతన కట్టడంపై ఎప్పటి నుంచో మతపరమైన వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవల వారణాసి జిల్లా కోర్టు, మసీదు సెల్లార్‌లో హిందువుల ప్రార్థనలకు అనుమతించాలని జనవరి 31న తీర్పునిచ్చింది. అంతేకాదు విగ్రహాల పూజలకు ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని గంటల్లోనే అంజుమాన్ ఇంతేజామియా నేతృత్వంలో మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో.. మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది.

You may also like

Leave a Comment