Hanu Man Movie Review: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటుడు తేజ సజ్జా పౌరాణిక టచ్ ఉన్న హనుమాన్ అనే సూపర్ హీరో ఫాంటసీ డ్రామాతో ముందుకు వచ్చారు. ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 12న మహేష్ బాబు యొక్క గుంటూరు కారంతో పోటీ పడబోతోంది. ఈ చిత్రం తేజ మరియు ప్రశాంత్ వర్మల రెండవ కలయికను సూచిస్తుంది; ఇది ప్రశాంత్ వర్మ యొక్క సినిమాటిక్ యూనివర్స్ యొక్క మొదటి భాగం.
హనుమాన్ హనుమంతుని ఆశీర్వాదం ద్వారా కథానాయకుడు హనుమంతుడు సూపర్ పవర్స్ పొందే మొదటి భారతీయ సూపర్ హీరో చిత్రంగా చెప్పబడుతోంది. తన అంజనాద్రి అనే గ్రామంలో జరిగే దారుణాలను అంతం చేయడానికి అతను యుద్ధం చేస్తాడు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే దర్శకత్వం బాగున్నాయి. ఇక పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచింది.
కాస్ట్ అండ్ క్రూ:
నటినటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, మీనాక్షి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కే నిరంజన్ రెడ్డి
సంగీతం: హరి గౌర, కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: దాశరధి శివేంద్ర
ఎడిటర్: సాయిబాబు తలారి
స్టోరీ:
హనుమంతు (తేజ సజ్జ), అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అక్క తమ్ముళ్లు. అంజనాద్రి అనే గ్రామంలో అక్రమాలను అంతం చేయడానికి హనుమంతు ముందుకు వస్తాడు. అతనికి ఆ హనుమాన్ శక్తులే వరంగా వస్తాయి. అసలు హనుమంతు ఎవరు? అంజనాద్రికి హనుమంతుకు సంబంధం ఏంటి? అక్కడ ఏమి అక్రమాలు జరిగాయి? హనుమంతు వాటిని ఎలా ఎదిరించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
నటీనటులు
కథ
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ స్లో అనే టాక్ రావడం
రివ్యూ:
హనుమాన్ సినిమాలో చాలా సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. ఇక కామెడీ సన్నివేశాలు కూడా బాగా పండాయనే చెప్పొచ్చు. హనుమంతుడిని ఎలివేట్ చేసే కొన్ని అంతిమ సన్నివేశాలను ప్రశాంత్ వర్మ చాలా బాగా రూపొందించారు. ఈ సన్నివేశాలలో గౌర హరి చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ సన్నివేశం కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. VFX వర్క్‌లు ఆకట్టుకుంటాయి. తేజ అమృతను రక్షించే పోరాట సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలుస్తాయి. తేజ సజ్జ సూపర్ పవర్స్ అందుకున్న క్షణం నుండి, సినిమా మరింత వినోదాత్మకంగా మారుతుంది. స్టార్ హీరోల రిఫరెన్స్‌లు కథనంలోకి చక్కగా కలిసిపోయాయి. ఆ కామెడీ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా సినిమా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.
రేటింగ్: 3.5/5