Telugu News » Harirama Jogaiah : కాపు సామాజికవర్గం శాసించే స్థితికి రావాలి.. పవన్‌ కు హరిరామ జోగయ్య మరో లేఖ..!

Harirama Jogaiah : కాపు సామాజికవర్గం శాసించే స్థితికి రావాలి.. పవన్‌ కు హరిరామ జోగయ్య మరో లేఖ..!

స్వాతంత్ర్యం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా అగ్రవర్ణాలలో 6 శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80 శాతం ఉన్న మిగిలిన బడుగు, బలహీనవర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించలేదని పేర్కొన్న హరిరామ జోగయ్య..

by Venu
Harirama Jogaiah: Pawan Kalyan should give clarity to Janasiniks.. Ex-minister's open letter..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు మరో బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు చేగొండి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).. ఇప్పటికే వివిధ అంశాలపై లేఖలు రాస్తూ వస్తున్న ఆయన తాజాగా రాసిన లేఖలో వైఎస్‌ఆర్‌ (YSR) కాంగ్రెస్‌ (Congress) పార్టీని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును (Chandra Babu) అధికారంలోకి తేవటమా? అని ఘాటుగా ప్రశ్నించారు.

harirama jogaiah wrote another letter suggesting that the janasena party should take 60 seats

పవన్‌ కళ్యాణ్ వెంట కాపులు.. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడం కోసం నడవడం లేదని తెలిపారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 40 నుండి 60 స్థానాల్లో పోటీ చేయాలని హరిరామ జోగయ్య సూచించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే.. పవన్‌ కళ్యాణ్ రెండున్నర ఏళ్లు ముఖ్యమంత్రి అని చంద్రబాబు ప్రకటించాలని లేఖ ద్వారా డిమాండ్‌ చేశారు.

స్వాతంత్ర్యం వచ్చి నాటి నుంచి నేటి వరకు ఒక్క దామోదరం సంజీవయ్య మినహా అగ్రవర్ణాలలో 6 శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు తప్ప 80 శాతం ఉన్న మిగిలిన బడుగు, బలహీనవర్గాల వారెవ్వరూ ముఖ్యమంత్రి పదవులు అధిష్టించలేదని పేర్కొన్న హరిరామ జోగయ్య.. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి మీరే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు..

కాపు సామాజికవర్గం యాచించే స్థాయి నుంచి శాసించే స్థితికి రావాలంటే, రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించి ఆ దిశగా ప్రయాణం చేయటానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలలో పవన్ కు ఉన్న చరిష్మా వల్ల ఇది తప్పక నెరవేరుతోందని ఆశిస్తునట్లు తెలిపారు. రాజ్యాధికారం దక్కించుకునే దిశగా జనసేన పార్టీని చేస్తున్న ప్రయాణంలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకోవాలని సూచించారు. ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ.. కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనలేమని చేగొండి తన లేఖలో పేర్కొన్నారు..

You may also like

Leave a Comment