Telugu News » Harish Rao : కాంగ్రెస్, బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు..!!

Harish Rao : కాంగ్రెస్, బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు..!!

మాటల యుద్ధాలు కోటలు దాటి పోతున్నా తగ్గేదెలే అనేలా ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) నిర్వహిస్తోన్న సభల్లో విమర్శలే ప్రధాన అస్త్రాలుగా మారుతోన్నాయి.

by Venu

తెలంగాణ (Telangana) లో జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయం అయ్యింది. అయితే 2023 లో జరిగే ఎన్నికల్లో ఎవరికి వారే గెలుస్తామనే ధీమాలో ఒకరి అసమర్ధతను ఒకరు వేలెత్తి చూపుకొంటున్నారు. మాటల యుద్ధాలు కోటలు దాటి పోతున్నా తగ్గేదెలే అనేలా ఎన్నికల వేడి పుట్టిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) నిర్వహిస్తోన్న సభల్లో విమర్శలే ప్రధాన అస్త్రాలుగా మారుతోన్నాయి.

ఈ క్రమంలో సిద్దిపేట (Siddipet) జిల్లా హుస్నాబాద్ (Husnabad) లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సభలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తుందని, అది చూసిన ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామనే ధీమలో ఉన్నారని విమర్శించారు.

పోటీకి సరిపడా అభ్యర్ధులే లేని బీజేపీ.. టికెట్లు కూడా ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ అధికారం కోసం కలలు కంటున్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు.. కాగా హుస్నాబాద్ లోనిర్వహించే సభకు సీఎం కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు హాజరు అవుతారని, పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు హాజరై సక్సెస్ చేయాలని హరీష్ రావు కోరారు.

సీఎం హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెట్టడానికి కారణం హుస్నాబాద్ కార్యకర్తల మీద ఉన్న నమ్మకం అని, హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని హరీష్ రావు తెలిపారు.

You may also like

Leave a Comment