కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం(Chidambaram) తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు(Minister harish Rao) డిమాండ్ చేశారు. చిదంబరం గురువారం ఓ ప్రెస్‌మీట్‌లో నిరుద్యోగం, ధరల నియంత్రణలో తెలంగాణ ఫెయిల్ అయిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ భవన్‌లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో కత్తికార్తీక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కండువా కప్పి కత్తి కార్తీకను మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ మంత్రి హరీష్‌రావు చిదంబరంపై మండిపడ్డారు. చిదంబరం మాటలు తెలంగాణ అమరుల గాయాలను మళ్లీ గుర్తుచేశాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
నిరుద్యోగ క్యాలెండర్ అంటూ రాహుల్ గాంధీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. రాహుల్‌వి గ్యారెంటీలు కాదని.. గారడీలు, అమరుల తల్లుల కాంగ్రెస్ పార్టీని శపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంపింది కాంగ్రెస్.. మళ్లీ సారి చెబుతుంది..’ చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..’ అంటూ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయని మంత్రి తెలిపారు. జూలైలో అత్యధికంగా 72శాతం డెలివరీలు జరిగినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 30శాతం డెలివరీలు మాత్రమే జరిగాయని, ప్రస్తుతం సౌకర్యాలు కల్పించడంతో గర్భిణులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు హరీశ్‌రావు వివరించారు.