డ్రై ప్రూట్స్ లలో ఎక్కువగా వినిపించే పేర్లలో ఒకటి అంజీరా (Figs).. ఏడాది పొడవునా చాలా ఈజీగా లభ్యమవుతున్న అంజీరా ఆరోగ్యానికి చేసే మేలు చాలా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయని, అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా.. డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అంజీరా ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలుసుకుందామా..
అంజీరా అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. వీటిని ప్రెగ్నెంట్ తో ఉన్న వారికి కూడా తినిపిస్తారు. ఈ అంజీరాలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని నమ్మే వారు ఎక్కువే.. ఇక అంజీరాలో విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుందని వారు తెలుపుతున్నారు..
అంజీరాలు తగిన విధంగా తీసుకోవడం వల్ల ఉదర, జీర్ణ సమస్యలు (Digestive problems) తగ్గిపోవడమే కాకుండా.. పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు దరి చేరుకుండా ఉంటాయని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.. రక్తహీనత ఉన్న వారు అంజీరాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని తెలియచేస్తున్నారు. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ఇక అంజీరాలు రోజు తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా అవుతాయని.. అంతేకాకుండా పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు తెలుపుతున్నారు. రోజూ 2 లేదా 3 అంజీరాలను పాల్లలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ అంజీరాలను తిని పాలను తాగాలంటున్నారు నిపుణులు..
ఈ అంజీరాలు పిల్లల ఎదుగుదలకు (Child growth) సహాయ పడుతుంది.. చర్మం, జుట్టు సమస్యలను కూడా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. మరోవైపు అంజీరాలు తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గే అవకాశం ఉందని.. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని నిపుణులు తెలియచేస్తున్నారు.. అందుకే అంజీరాలు లిమిట్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేయడం జరిగింది. కావున వీటిని ఆచరించడానికి ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి.