పంజాబ్ (Punjab) లోని ఓ వ్యక్తి కడుపులో మినీ స్క్రాప్ దుకాణాన్ని కనుకున్నారు వైద్యులు (Doctors). విచిత్రంగా ఉంది కదూ…నిజం! 40 ఏళ్ల వ్యక్తి కడుపులో నట్లు, బోల్టులు, రాఖీలు, హెయిర్ పిన్నులు (Hair Pins), ఇయర్ ఫోన్స్, ప్లాస్టిక్ చెత్త…ఇలా అనేక పదార్థాలు అతడి కడుపులో నుంచి బయటకు తీశారు. అసలిదంతా ఏలా జరిగిందో వైద్యులకు కూడా అంతు పట్టడం లేదు.
పంజాబ్ లోని ఒక వ్యక్తి రెండేళ్లుగా కడుపు నొప్పి తట్టుకోలేక వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతడికి ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. ఆ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఆ పేటెంట్ కడుపులో అన్నీ మెటల్ వస్తువులు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుంచి ఆ ఐటమ్స్ తీశారు.
అతని కడుపులో ఇయర్‌ఫోన్స్, వాషర్స్, నట్స్, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్, బటన్స్, వ్రాపర్స్, హెయిర్ క్లిప్సలతో పాటు ఇంకా అనేక వస్తువులు ఉన్నాయి. వీటిని చూసిన డాక్టర్లు ఇదేమైనా స్క్రాప్ దుకాణమా అని ఆశ్చర్యపోయారు. అసలు అతడి కడుపులోకి ఇవి ఎలా వెళ్లయోనని డాక్టర్లు తలపట్టుకున్నారు.
ఇలాంటి కేసును ఆపరేట్ చేయడం ఇదే తొలిసారి అని డాక్టర్ అజ్మీర్ కల్రా తెలిపారు. ఆ పేషెంట్ శరీరం నుంచి అన్ని వస్తువుల్ని తీసివేసినా కూడా అతని ఆరోగ్యం కుదుటపడలేదు. చాన్నాళ్ల నుంచి అతని కడుపులో వివిధ వస్తువులు ఉన్న కారణంగా.. అతని ఆరోగ్యంపై ప్రభావం పడిందని డాక్టర్లు తెలిపారు. ఆ వ్యక్తి ఎందుకు ఆ వస్తువుల్ని మింగాడో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అతను గత కొన్నాళ్ల నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.