పేగుబంధం ఎంత బలమైనదో.. ఆ యముడు సైతం దూరం చేయలేడని నిరూపించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకొంది. ఒకే రోజు తల్లి, కొడుకుల మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. హృదయాన్ని మెలిపెట్టేలా ఉన్న ఈ సంఘటన వివరాలు తెలుసుకొంటే.. తన కళ్ళ ముందు కొడుకు గుండెపోటు (Heart Attack)తో మరణించడం తట్టుకోలేని ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది.
మెదక్ (Medak)జిల్లా, హవేలి ఘణపూర్ (Haveli Ghanapur) మండలం, కుచన్ పల్లి (Kuchan Palli) గ్రామానికి చెందిన నర్సా గౌడ్ వయసు(39) సంవత్సరాలు.. ఆటో నడిపించుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నేటి ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఛాతిలో నొప్పి వస్తుందని అతని భార్యతో చెప్పగా.. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్టు సమాచారం..
మరోవైపు కొడుకు మరణ వార్త విన్న ఆ తల్లి.. తీవ్ర వేదనకు గురవ్వడంతో.. ఆమె గుండె సైతం ఆగిపోయింది.. కాగా మృతుడు తల్లి వయసు (62) సంవత్సరాలని స్థానికులు వెల్లడించారు.. మృతుడు నర్సా గౌడ్ కు, భార్య లత(35).. 9వ తరగతి చదువుతోన్న కూతురు ప్రసన్న(15).. 7 ఏడవ తరగతి చదువుతున్న కొడుకు కార్తీక్ గౌడ్(12) ఉన్నారు. ఇక ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని వీరి మరణ వార్త తెలుసుకొన్న వారు అనుకొంటున్నారు..