Telugu News » Vijay Kanth : విజయ్ కాంత్ ఆరోగ్యంపై హీరో సూర్య ట్వీట్.. వైరల్ గా మారిన పోస్ట్..!!

Vijay Kanth : విజయ్ కాంత్ ఆరోగ్యంపై హీరో సూర్య ట్వీట్.. వైరల్ గా మారిన పోస్ట్..!!

విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు ఆయనను నవంబర్ 18న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. మృతి చెందినట్లు నెట్టింట వార్తలు వైరల్ (News Viral) అయ్యాయి.

by Venu

కోలీవుడ్ నటుడు, డీఎండీకే (DMDK) నేత విజయ్ కాంత్ (Vijay Kanth) ఆరోగ్యం విషయంలో సోషల్ మీడియాలో పలు విధాలుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయ్ కాంత్ ఆరోగ్యం విషయంలో ఆయన భార్య సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.. తన భర్త ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించిన విజయ్ కాంత్ భార్య తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని కోరారు. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

మరోవైపు విజయ్ కాంత్ ఆరోగ్యంపై హీరో సూర్య (Hero Surya) ఓ ట్వీట్ చేశారు. ఈ మేరకు అన్నన్ విజయ్ కాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది మనసుల్లో నేను ఒకడిని. వారి ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయనను త్వరగా కోలుకునేలా చేస్తాయంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నటుడు విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే..

ఈ నేపథ్యంలో విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు ఆయనను నవంబర్ 18న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆయన.. మృతి చెందినట్లు నెట్టింట వార్తలు వైరల్ (News Viral) అయ్యాయి. ఈ క్రమంలో అసత్య వార్తలు వైరల్ చేయొద్దన్న విజయ్ కాంత్ కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఈరోజు ఉదయం ఓ ఫొటో రిలీజ్ చేశారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు.

You may also like

Leave a Comment