ప్రముఖ తమిళ్ హీరో (Tamil Hero) విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పెడుతున్నాడని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే చాలాకాలంగా స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. అదీగాక అప్పటి ప్రగతి భవన్ (Pragati Bhavan)లో గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ (KCR)తో సైతం భేటీ అయ్యారు. వీరి భేటీపై కూడా ఎన్నో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.
మరోవైపు తమిళనాడు రాజకీయాల్లోకి ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. కరుణానిధి, ఎం.జి రామచంద్రన్, జయలలిత, టి.రాజేందర్, రాధా రవి, కారుణాస్, గౌతమి, సీమాన్, శరత్ కుమార్, కుష్బూ, విజయ్ కాంత్, కమల్ హాసన్, తాజాగా ఉదయనిది స్టాలిన్. ఇలా చాలా మంది పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కానీ పొలిటీషియన్ గా సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటిక్ విజయ్ ‘మక్కల్ ఇయక్కమ్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2022లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ ఇయక్కమ్ తరపున అభ్యర్థులను బరిలోకి దింపాడు.అలా మొత్తం 169 స్థానాల్లో పోటీ చేస్తే 121 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో రాజకీయ పార్టీ ప్రారంభించాలని విజయ్ ని పలువురు డిమాండ్ చేశారు.
కాగా తాజా సమాచారం ప్రకారం విజయ్ కూడా రాజకీయాలపై చర్చించారనే టాక్ వినిపిస్తోంది. మరో నెల రోజుల్లో కొత్త పార్టీ విషయంపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. కాగా ఇన్నాళ్లుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై జరుగుతున్న ప్రచారానికి ఈ సారైనా బ్రేక్ పడుతుందా అని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు..