Hi Nanna Movie Review : మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి, తీగల మూర్తి ఈ సినిమా ని నిర్మించారు. నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం శౌర్యువ్ ఈ మూవీ లో నటించారు. హాయ్ నాని సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కి హేషమ్ అబ్ధుల్ వహాబ్ సంగీతాన్ని ఇచ్చారు.
చిత్రం : హాయ్ నాన్న
నటీనటులు : నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం శౌర్యువ్ తదితరులు
మ్యూజిక్: హేషమ్ అబ్ధుల్ వహాబ్
దర్శకుడు: శౌర్యువ్
నిర్మాత : మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి, తీగల మూర్తి
విడుదల తేదీ : డిసెంబర్ 07, 2023
Also read:
Hi Nanna Movie Review:
కథ మరియు వివరణ:
ఇక సినిమా కథ విషయానికి వస్తే.. విరాజ్ (నాని) ముంబైలో స్టూడియో ని నడుపుతూ వుంటారు. తనకి ఓ కూతురు వుంది. ఆమె పేరు మహి (కియారా ఖన్నా). తన కి తండ్రి లాంటి వ్యక్తి (జయరాం). అతని తో ఉంటాడు. చక్కగా అందరు సంతోషంగా వుంటారు. అంతా బానే ఉంటున్న టైం లో యశ్న (మృణాల్ ఠాకూర్) వీళ్ళ జీవితం లోకి వస్తుంది.
విరాజ్ తన కూతురుతో అనుకున్న లైఫ్ లోకి వచ్చి ఆమె ఎంతో మార్పుని తెస్తుంది..? ఆఖరికి ఏం అయింది..? ఎలాంటి మార్పు వచ్చింది..? ఇవి తెలియాలంటే మూవీ చూడాలి. నాని తండ్రి లో అద్భుతంగా నటించాడు. తండ్రిగా కంటే కూడా రెండు ప్రపంచాల మధ్య నలిగిపోయే వ్యక్తిగా చేసాడు. ఈ సినిమా లో నాని, కియారా మధ్య సీన్స్ కూడా బావున్నాయి. బేబీ కియారా ఖన్నా చాలా క్యూట్ గా నటించింది. సాను వర్ఘీసీ సినిమాటోగ్రఫీ, హేషమ్ అబ్ధుల్ వహాబ్ సంగీతం కూడా బావున్నాయి.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ
సినిమా లో చూపించిన ఎమోషన్స్
నటీ నటులు
సంగీతం
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
మొదటి భాగంలో వున్నా రొటీన్ సీన్స్
సాగదీత సన్నివేశాలు
రేటింగ్: 3/5