విశాఖ(Vishakapatnam)లో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేగింది. కంచరపాలెం (Kancharapalem) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. తాటిచెట్ల పాలెం (Thaticherlapalem) రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణంలో పూజలు చేసి తవ్వినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 అడుగుల గొయ్యి తవ్వకాలు జరిగాయి. గుప్తనిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి వ్యక్తులు వచ్చినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేసిన సదరు వ్యక్తులు దోష నివారణ కోసం పూజలు చేసామంటూ చెప్పుకొస్తున్నారు.
రాత్రివేళ భక్తిపాటలు పెట్టుకొని పూజల మాటున తవ్వకాలు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రైల్వే ఉద్యోగి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తవ్వకాలు ఎందురు జరిపారో విచారిస్తున్నారు.
అదేవిధంగా తెలంగాణలోనూ గుప్తనిధుల వేట ఆగడంలేదు. తాజాగా వికారాబాద్ జిల్లా యాలాల-విశ్వనాథ్‌పూర్ రోడ్డు మార్గంలో దుండగులు తవ్వకాలు జరిపారు. యాలాల గ్రామానికి చెందిన జి.వెంకట్‌రెడ్డి తన పొలంలో ఉన్న శివలింగాన్ని అర్ధరాత్రి తొలగించి తవ్వారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.