Telugu News » హీరో బాలకృష్ణ భార్య ఎవరి కూతురు..? పెళ్ళికి ఆయన ఎంత కట్నం తీసుకున్నారు..?

హీరో బాలకృష్ణ భార్య ఎవరి కూతురు..? పెళ్ళికి ఆయన ఎంత కట్నం తీసుకున్నారు..?

by Sravya
balakrishna-wife

బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ ఎప్పటినుండో మంచి స్టార్ హీరోగా దూసుకు వెళ్ళిపోతున్నారు. బాలయ్య ఈ మధ్య కూడా వరుస హిట్లతో దూసుకు వెళ్ళిపోతున్నారు. బాలయ్య సినీ విషయాలన్నీ మనకి తెలుసు కానీ పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనకి తెలియదు. ఎన్టీఆర్ గారికి మొత్తం 11 మంది పిల్లలు. అందులో ఏడుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అందరికంటే చిన్నవాడు బాలకృష్ణ. చిన్నవాడు కాబట్టి బాలయ్య అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రోజులప్పుడు ఎన్టీఆర్ భార్య బసవతారకం బాలకృష్ణ పెళ్లి కోసం చాలా ఒత్తిడిని తీసుకొచ్చారు.

ఎన్నికల హడావిడిలో ఉన్నారు ఎన్టీఆర్. బాలయ్య పెళ్లి విషయాన్ని సహచరుడైన నాదెండ్ల భాస్కర రావు కి అప్పగించారు ఆయన బంధువు దేవరపల్లి సూర్యరావు కూతురైన వసుంధరని చూపించారు దీంతో అమ్మాయి అందరికీ నచ్చింది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. 8 డిసెంబర్ 1982లో వసుంధర బాలకృష్ణ పెళ్లి జరిగింది దేవరపల్లి సూర్యరావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ యజమాని.

Also read:

బాలయ్య వివాహం సమయంలో ఎలాంటి కట్నం కూడా తీసుకోలేదు పెళ్లికూతురు తండ్రి కూతురికి కానుకగా హైదరాబాదులో 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించడం జరిగింది బాలకృష్ణ వసుంధరకి ముగ్గురు పిల్లలు. బ్రాహ్మణి, తేజస్విని. కొడుకు మోక్షజ్ఞ. బ్రాహ్మణిని చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసిన విషయం తెలిసిందే తేజస్విని గీతం యూనివర్సిటీ ఎండి భరత్ కి ఇచ్చి పెళ్లి చేశారు.

You may also like

Leave a Comment