Telugu News » Hyd ORR: అందుబాటులోకి ఓఆర్ఆర్‌ సైకిల్ ట్రాక్.. అద్దెకు సైకిళ్లు..!

Hyd ORR: అందుబాటులోకి ఓఆర్ఆర్‌ సైకిల్ ట్రాక్.. అద్దెకు సైకిళ్లు..!

ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

by Mano
Hyd ORR: ORR cycle track available.. Bicycles for rent..!

హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డు(Hyderabad ORR) సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌(Solar roof top cycle track) అందుబాటులోకి వచ్చింది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ట్రాక్‌ను నిర్మించింది. ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

Hyd ORR: ORR cycle track available.. Bicycles for rent..!

ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక చొరవ తీసుకొని సైకిల్‌ ట్రాక్‌ మీద సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్‌పై సైక్లింగ్‌ చేసే అవకాశం ఉండగా… లేని వారి కోసం అద్దెకు సైకిల్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు.

24కి.మీ ఓఆర్‌ఆర్‌ సైకిల్‌ ట్రాక్‌పై 4 చోట్ల సైకిల్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేయగా.. అందులో తెలంగాణ పోలీస్‌ అకాడమీ జంక్షన్‌, నానక్‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్‌ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ అన్నిరకాల మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్‌లో సైకిళ్లు అద్దెకు అందుబాటులో ఉండగా, త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో సైకిల్‌ స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం మొదటి సైకిల్‌ స్టేషన్‌ను నార్సింగి హబ్‌లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. అందులో 40కి పైగా ఎలక్ట్రిక్‌ సైకిళ్లు సైతం ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అద్దెకు ఇచ్చే సైకిల్‌కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు.

ప్రధానంగా సైకిల్ ట్రాక్‌లోకి ఇతర వాహనాలు రాకుండా మీటింగ్ పాయింట్లు, ట్రాక్ కలరింగ్, సేఫ్టీ సంకేతాలు, విద్యుత్ దీపాలు, మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. దీని వల్ల ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సైక్లింగ్ చేసేందుకు వీలుగా విద్యుత్ దీపాలతో వెలుతురును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

You may also like

Leave a Comment