అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి పాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ (BRS) పార్టీతో పాటు.. ఆనేతలకు అంతగా కలిసి రావడం లేనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణించడం.. అలాగే ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ (KTR) పడిపోవడం.. ఎలక్షన్లు ముగిశాక.. కేసీఆర్ (KCR) తుంటి విరగడం.. కవిత (Kavitha) జైలుకి వెళ్ళడం లాంటి వ్యతిరేకతలు ఎదురైయ్యాయి..
మొత్తానికి పది సంవత్సరాలు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ప్రస్తుతం గడ్డురోజులున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఉగాది పంచాంగంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండమని పండితులు తెలిపారు.. అయితే తెలుగు వారి కొత్త సంవత్సరం రోజున మరో ఘటన జరిగింది. బీఆర్ఎస్ నేత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud) స్వల్ప గాయాలతో బయటపడ్డారని సమాచారం..
ఖైరతాబాద్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మిత్రుడిని పరామర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో టైరు పగిలిపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. వాహనం పక్కనున్న మెట్రో పిల్లర్ డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవికుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఆయన మిత్రుడు రాజు, డ్రైవర్ ఖదీర్ కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది.