కాంగ్రెస్ (Congress) పార్లమెంట్ సీట్ల కేటాయింపు రచ్చ రచ్చగా మారుతుంది. వలస నేతలకు ప్రాముఖ్యత ఇస్తుండటంతో అసంతృప్తులు అక్కసు వెళ్లగక్కుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ సమయాయంలో వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గ స్థానాన్ని కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద క్రిష్ణ మాదిగ (Manda Krishna Madiga) కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో ఉన్న 3 ఎస్సీ స్థానాల్లో ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడంతో నిరసనకు దిగారు.. కాంగ్రెస్ పార్టీ మాదిగ కుల వ్యతిరేక పార్టీ అని షెడ్యూల్, దళిత కులాల్లో మాదిగల జనాభాలో 70 శాతం ఉన్న మాదిగలను కాదని, 25 శాతం ఉన్న మాలలకు టికెట్ కేటాయించడంపై మండిపడుతున్నారు.. స్థానికుడు కాకపోయిన మల్లు రవికి పార్టీ టికెట్ కేటాయింపు పై సైతం విమర్శలు చేశారు..
అదేవిధంగా మాదిగలకు చేసిన ద్రోహనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి వ్యతిరేకంగా రోడ్డెక్కుతామని మంద క్రిష్ణ మాదిగ హెచ్చరించారు. మూడు స్థానాల్లో ఒక్కటి కూడా దక్కక పోవడానికి కారణమైన మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge)కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి తన రెడ్డి సామాజిక వర్గానికి సింహ భాగం కేటాయిస్తున్నారని ఆరోపణలు చేశారు..
అంతేకాకుండా బీసీల ప్రాతినిధ్యం పెరగకుండ వారికి జనాభా ప్రాతిపదికన 8 టిక్కెట్లు రావాల్సి ఉండగా కేవలం 2 స్థానాలు మాత్రమే కేటాయించడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పక్కా మాదిగలకు, బీసీలకు వ్యతిరేకమని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాష్ట్రంలో బీసీ, మాదిగల సంగటిత శక్తితో ముందుకు సాగుతామని మంద క్రిష్ణ మాదిగ తెలిపారు..
రాజీనామా చెయ్యకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి నేను చూసుకుంటా అని చెప్పిన రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి (Kadiam Srihari)ని కండువ కప్పి ఎలా పార్టీలో చేర్చుకున్నారో చెప్పాలన్నారు. ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరినో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మంద క్రిష్ణ మాదిగ డిమాండ్ చేశారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రెడ్డి లకు ఎంపి టిక్కెట్లు ఇచ్చారు కానీ ఎస్సీలకు మాత్రం టిక్కెట్లు ఇవ్వలేదని అన్నారు..
తనకు వరంగల్ టికెట్ కేటాయించకుండా మాదిగలకు అన్యాయం చేశారని మంద క్రిష్ణ మాదిగ ఆరోపణలు చేశారు. 10 రోజుల పాటు జరుగబోయే కాంగ్రెస్ వ్యతిరేక విధానాలపై మాదిగ నాయకులతో పాటు మాదిగ కులస్థులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి మాదిగలకు చేసింది గోరంతా.. అన్యాయం మాత్రం కొండంతా అని మండిపడ్డారు.