యువతకు జీతాలిచ్చి మొబైల్ స్నాచింగ్(Mobile Snatching) చేస్తున్న ముఠాను గుర్తించినట్లు హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి(Hyd CP Srinivas Reddy) తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. నగరంలో రోజురోజుకు మొబైల్ చోరీ ఘటనలు పెరుగుతున్నాయని, నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్‌గా చేస్తున్నారని తెలిపారు.
కొన్ని సందర్భాల్లో మాటల్లో కలిపి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని తెలిపారు. రాత్రి 10 గంటలు తర్వాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మూడు కమిషనరేట్(Commissionerate) పరిధిల్లో ఈ ముఠా మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడుతోందని తెలిపారు. రోజుకు మూడు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు.
అయితే ఈ మొబైల్ స్నాచింగ్ ఇంటర్నేషనల్ ముఠా పనిగా గుర్తించామని తెలిపారు. ఏడు కేసులు హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించామన్నారు. బైక్ దొంగతనం కేసు ఎల్బీ నగర్ కేసు ను ఛేదించామన్నారు. సూడాన్ దేశానికి చెందిన ఐదుగురు అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. వారు ఇక్కడ దొంగతనం చేసి మొబైల్స్‌ను సూడాన్ కి పంపుతున్నట్లు గుర్తించామన్నారు.
నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో 12 నిందితులు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారని, ఐదుగురు సూడాన్‌కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ అమ్మకాలకు, రిసీవింగ్‌కు జగదీష్ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారిందన్నారు. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్‌ను విడివిడి భాగాలను కూడా అమ్ముతున్నారని తెలిపారు.