న్యూ ఇయర్స్ (New Years)కి వెల్కమ్ చెప్పడానికి నగరం అంతా సిద్దం అవుతుంటే.. మరోవైపు మాదక ద్రవ్యాల మాఫీయా రెచ్చిపోతోంది. కొత్త సంవత్సరం వేడుకలే టార్గెట్ గా యువతని దృష్టిలో పెట్టుకొని నగరంలోకి మాదక ద్రవ్యాలని చేరవేస్తున్నారనే అనుమానంతో అధికారులు ఇప్పటికే విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.. పలుచోట్ల డ్రగ్స్ సైతం పట్టుకొన్న పోలీసులు.. మాదక ద్రవ్యాల ముఠాను కూడా అరెస్ట్ చేశారు..
మరోవైపు నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరిగి పోవడంతో.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల రవాణా సైతం ఉపందుకొంది. ఈ విషయంలో పోలీస్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.. ఈక్రమంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మైలార్ దేవ్ పల్లి (Mylar Dev Palli)లో దోపిడీ గ్యాంగ్ రెచ్చిపోయింది. జల్ పల్లి (Jal Palli) దగ్గర దోపిడీ గ్యాంగ్ ఎక్సైజ్ పోలీసుల (Excise Police)పై దాడికి పాల్పడింది.
గంజాయి ఉందన్న అనుమానంతో పోలీసులు ఓ బైక్ ను నిలిపివేశారు. దీంతో బైక్ పై ఉన్న దోపిడీ దొంగలు పెప్పర్ స్ప్రే కొట్టి పరారయ్యారు. అయితే పోలీసులు ఇద్దరిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారి నుంచి బైకు, నకిలీ తుపాకీతో పాటు రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు..