నగరంలో రోజు రోజుకు వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకొన్న కొందరి నిర్లక్ష్యం వల్ల అమ్మాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. ఇక వీకెండ్ డేస్ వచ్చిందంటే నగరంలో పర్యాటకుల తాకిడికి అదుపు ఉండదు.. ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రదేశాలను చూడటానికి స్థానికంగా ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు.. లవర్స్.. ఇంకా నగరానికి వచ్చిన చూట్టాలతో పలు ప్రదేశాలు కిటకిటలాడుతూ ఉంటాయి.

సోమవారం మాదాపూర్ పోలీస్ సిబ్బందితో కేబుల్ బ్రిడ్జి పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. కేబుల్ బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని.. అలాగే ఈ మధ్య జరిగిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఈ క్రమంలో బ్రిడ్జిపై వాహనాలు ఆపి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తే జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు.
ఒకవేళ ఎవరైనా ఫోటోలు, సెల్ఫీలు దిగాలి అనుకుంటే ఐటీసీ కోహినూర్ (ITC Kohinoor) వద్ద వాహనాలను పార్క్ చేసి కేబుల్ బ్రిడ్జి పై ఉన్న ప్రత్యేక ట్రాక్ పై మాత్రమే సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవాలని సూచించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుండటం వల్ల పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు..