Telugu News » Hyderabad : అఖిల్ పహిల్వాన్‌ కస్టడీలో కొత్త విషయాలు.. ఉద్యోగాల పేరుతో బ్రోతల్ దందా..!!

Hyderabad : అఖిల్ పహిల్వాన్‌ కస్టడీలో కొత్త విషయాలు.. ఉద్యోగాల పేరుతో బ్రోతల్ దందా..!!

అఖిలేష్‌ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు. నిందితుల నుంచి 22 మొబైల్స్‌ స్వాధీనం చేసుకొన్నారు.

by Venu

అఖిలేష్‌ పహిల్వాన్‌ (Akhilesh Pailwan) అండ్‌ బ్యాచ్‌ దందాపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. అబిడ్స్‌ (Abids)లో ఫార్చూన్‌ హోటల్‌ అడ్డాగా బ్రోతల్ దందా నిర్వహిస్తోన్న ఈ గ్యాంగ్.. ఉద్యోగాల పేరిట యువతుల్ని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫార్చూన్‌ హోటల్‌ (Fortune Hotel)లో ఆకస్మిక తనిఖీలు చేసి..16 మంది యువతుల్ని రెస్క్యూ చేశారు.

పశ్చిమ బెంగాల్, ముంబైకి చెందిన మొత్తం 16 మంది బాధిత మహిళలను రక్షించారు. అఖిలేష్‌ అండ్‌ బ్యాచ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా హోటల్ లో ఉన్న 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో నిర్బంధించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందన్నారు.. అయితే ఈ వ్యవహారంలో ఇంటర్నేషనల్‌ లెవల్‌లో లింకులు ఉన్నట్లు గుర్తించారు..

అఖిలేష్‌ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించిన పోలీసులు. నిందితుల నుంచి 22 మొబైల్స్‌ స్వాధీనం చేసుకొన్నారు. ఆ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు తెలుసుకొన్నారు.. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి ఫోన్ నెంబర్లు సైతం గుర్తించినట్టు తెలిసింది.

అఖిల్‌ పెద్ద మొత్తంలో ఈ వ్యవహారం నడుపుతున్నారని గుర్తించిన పోలీసులు.. అతనికి పరిచయం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గరికి కూడా అమ్మాయిలను పంపించినట్టు అనుమానిస్తున్నారు.. ఆ దిశగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్న పోలీసులు నిందితులను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు.. కస్టడీ ముగియడంతో రిమాండ్‌కు తరలించారు..

You may also like

Leave a Comment