రాష్ట్రంలో పొలిటికల్ హిట్ డిగ్రీల మీద డిగ్రీలు పెరిగిపోతుంది. నేతల మధ్య విమర్శల యుద్ధం హద్దులు దాటుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) నేతలు ఉదృతంగా తెగిన ఆయకట్టులా దూకుతుండగా.. వారు సైతం.. మాటకు మాటే సమాధానంలా గతప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని తవ్వడం కనిపిస్తోంది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు..
కేసీఆర్ (KCR) ను ఉద్దేశిస్తూ.. మీ అత్తగారి ఊర్లో కట్టకు అటువైపు నువ్వు.. ఇటువైపు మేము ఉంటాం ప్రజలు ఎవరి వైపు ఉంటారో చూద్దామా? అని సవాల్ విసిరారు.. సిరిసిల్ల (Siricilla) చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు వేయకపోతే బతుకుకొట్టినట్లా? అని ప్రశ్నించిన మంత్రి.. చేనేత కార్మికులు నేచిన ప్రతీ బట్టను కొనాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.. మేము రేపటి నుంచి ఫీల్డ్ లో ఉంటాం.. ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామని పేర్కొన్నారు.
కరీంనగర్ కు ఐదు ఏళ్ళు ఎంపీగా నేను ఉన్నా.. కేసీఆర్ ఉన్నారు రచ్చ ఎలా? చేస్తారో చూద్దామని వెల్లడించారు.. వేములవాడ గుడిముందు చెప్పులు ఎత్తుకొని వెళ్ళే వాళ్ళతో సమానంగా కేసీఆర్ ను చూడవలసి రావడం ఆయన పద్దతిని తెలియచేస్తుందని పొన్నం ఆరోపించారు.. వెలకొద్ది పుస్తకాలు చదివా అని చెప్పుకొనే వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి అని మండిపడ్డారు.. ఆయన భాష చూస్తుంటే.. అసహ్యం వేస్తుందని తెలిపారు..
అవే మాటలు మేము మాట్లాడితే కేసీఆర్ కు విలువ ఉంటుందా..? అని వ్యాఖ్యానించిన పొన్నం.. దొంగ పాస్ పోర్ట్ లాగా నీళ్లను విదేశాలకు మేమేమైనా అమ్ముకున్నామా అని మండిపడ్డారు.. ప్రాజెక్ట్ లలో నీళ్ళు ఎక్కడ బోయినయి..? సిరిసిల్ల చేనేత అన్నల దగ్గర ఉన్న బకాయిలు ఎవరి హాయంలో జరిగిందని ప్రశ్నల వర్షం కురిపించారు.. చేనేత కార్మికులకు మీ పదేళ్ల ప్రభుత్వం ఎం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు..
వారికి బతుకమ్మ చీర తప్ప ఏం చేశారు..? చేనేతలో సంక్షోభాన్ని సృష్టించింది మీరు కాదా అని దుయ్యబట్టారు.. కేసీఆర్ పిట్టల దోరగా మారొద్దని హితవు పలికిన పొన్నం.. లిక్కర్ వ్యవహారం నుంచి బయటపడటంపై దృష్టి పెట్టాలని సూచించారు. అవినీతిలో కూరుకు పోయిన మీ మాటలు రాష్ట్ర ప్రజలు వినే స్థితిలో లేరని అన్నారు.. చేసిన అక్రమ పనులు బయటకు వస్తున్న కొద్ది భయంతో ఏం మాట్లాడుతున్నారో తండ్రి కొడుకులకు అర్థం అవడం లేదని విమర్శించారు..