పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు(Telangana politics) హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్(CONGRESS) పార్టీలో చేరుతున్నారు. కొందరు తమ రాజకీయ భవిష్యత్ కోసం అని చెబుతుండగా.. మరికొందరు తమ పిల్లల భవిష్యత్ కోసం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్‌లో కీలక పదవులు అనుభవించిన కేకే(KK), కడియం శ్రీహరి(Kadium srihari)లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే కడియం చేరగా.. కేకే త్వరలోన చేరనున్నట్లు సమాచారం.
ఇక కే కేశవరావు కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్యా కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై వరంగల్ జిల్లా నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్(Errabelli Dayakar) కడియంపై ఫైర్ అయ్యారు.‘కడియంకు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇప్పించింది నేనే. ఇప్పుడు ఆయన బిడ్డను ఓడగొట్టడంలో ముందు ఉండేది కూడా నేనే.ల్యాండ్ దందాలు, ఫైరవీలు చేసే బ్రోకర్లు పార్టీలు మారుతారు. మనం ఐక్యతగా ఉండాలి. పోయినొడు పోని..మనం ధైర్యంతో ఉండాలి.
కడియం శ్రీహరి బిడ్డ 3వ స్థానంలో ఉంటుంది.ఆమెకు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తున్నారని ప్రజలు, పార్టీ శ్రేణులు కసితో ఉన్నారు.ఆమెను ఓడగొట్టాలనే పట్టుదల అందరిలో పెరిగింది.మొన్నటివరకూ ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు కసి మీద 25మంది టిక్కెట్ అడుగుతున్నారు’ అంటూ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కూడా కడియం శ్రీహరిపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘కడియం శ్రీహరి చస్తే ముగ్గురు కూతుర్లే మొయ్యాలి. కడియం శ్రీహరి లాంటి రాజకీయ దుర్మార్గుడిని నా జీవితంలో చూడలేదు.కూతురు కోసం కడియం ఎంతో మాయ చేశాడు.
కూతురు కోసం కడియం విలువలు తాకట్టుపెట్టిండు.నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి శ్రీహరి రాజీనామా చెయ్యాలి.నువ్వు మళ్ళీ గెలిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కడియం కావ్యకు డిపాజిట్ రాకుండా చేస్తాం’ అని ఎమ్మెల్సీ స్పష్టంచేశారు.